నాగర్ కర్నూల్ : మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో ( Muncipal Elections ) అవకాశమిచ్చి మోసపోవొద్దని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy) ఓటర్లకు సూచించారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 18,19 వ వార్డులో పస్పుల గాయత్రి లక్ష్మయ్య, పెంటామరాజు వాణి పార్థసారథిని గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల పరిధిలోని కాలనీలలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రభుత్వంతో కోట్లాడి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే పనులు కాకుండా మాయ మాటలు చెప్పి పూట గడుపుతారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలపై నిలదీయలని ప్రజలకు పిలుపునిచ్చారు.