అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achchampet) పట్టణంలోని సాయినగర్ కాలనికి చెందిన మంత్రాల సాయిలు, రేణయ్యలకు చెందిన గొర్రెలపై (Sheep) కుక్కలు( Dogs) దాడి చేసి చంపివేశాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో కుక్కలు గొర్రెల మందపై దాడి చేయగా 25 గొర్రెలు చనిపోయాయి. పట్టణ సమీపంలోని తమ వ్యవసాయ పొలాల వద్ద మందను ఉంచిన రైతులు రాత్రి 9 గంటల ప్రాంతంలో భోజనం కోసం ఇంటికి వచ్చారు. తిరిగి రాత్రి వెళ్లి పడుకున్నారు.
అయితే ఉదయం చూసేసరికి గొర్రెలు అన్ని మృతి చెంది ఉన్నాయి. గొర్రెలను పరిశీలించగా కుక్కలు దాడి చేసిన గాయాలు కనిపించడంతో గొర్రెలు మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెల విలువ దాదాపు రెండున్నర లక్షల విలువ ఉంటుందని, ఒకేసారి 8,10 వరకు కుక్కలు మందలోకి చొరబడి దాడి చేయడంతో మృతి చెందాయని తెలిపారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గొర్రెల కాపరులు కోరారు.