జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 24 : ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కంటివెలుగు’ కార్యక్రమం అద్భుతమని జడ్చర్ల ఎ మ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి కొనియాడారు. బాదేపల్లి జెడ్పీహైస్కూల్లో కౌన్సిలర్ రఘురాంగౌడ్ సౌజన్యంతో వి ద్యార్థులకు ఎమ్మెల్యే శుక్రవారం ఉచితంగా కండ్లద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. రాష్ట్రమంతటా కంటివెలుగు శిబిరాల్లో అందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కంటి సమస్యతో బాధపడుతున్న వారికి చూపునిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు మంచిగా చదివి ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
రూ.2.50లక్షల ఎల్వోసీ అందజేత
మండలంలోని కిష్టంపల్లి గ్రామానికి చెందిన వెంకట య్య హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో గుండె చికి త్స చేయించుకున్నారు. వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.2.50లక్షలు మంజూరయ్యాయి. అందుకు సంబంధించిన ఎల్వోసీని ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఆయూబ్ ఉమ్రా యాత్రకు వెళ్తు న్న సందర్భంగా అతడిని ఎమ్మెల్యే పూలమాల, శాలువాతో సత్కరించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా భగవంతుడిని ప్రార్థించాలని కో రారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, తె లంగాణ సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.