దేవరకద్ర రూరల్, డిసెంబర్ 12 : బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలానికి చెందిన పలువురికి సోమవారం భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్‌లో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. చిన్నచింతకుంటకు చెందిన రవికుమార్‌కు రూ.లక్షా 25వేలు, మద్దూర్‌కు చెందిన మహిముదాబేగానికి రూ.54వేలు, ఇమామ్‌కు రూ.48వేల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ఆపత్కాలంలో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు.
అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలను సీఎం సహాయనిధితో అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. పేదల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందరూ రుణపడి ఉండాలన్నారు. కాగా ఆపత్కాలంలో సీఎం సహాయనిధి మంజూరుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే ఆలకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కా ర్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.