జడ్చర్ల టౌన్, ఆగస్టు 8 : కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలిచి, ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్, ఊర్కొం డ, బాలానగర్, నవాబ్పే ట, రాజాపూర్ మండలాలకు చెంది న 300 మం ది లబ్ధిదారులకు జడ్చర్లలోని చంద్రాగార్డెన్‌లో చెక్కులను కలెక్టర్ రవినాయక్‌తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ముందుగా ప్రజాగాయకుడు గద్దర్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌ నం పాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కులవృత్తులపై ఆధారపడిన వారిని ఆదుకోవాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ రూ.లక్ష ఆర్థికసాయం పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఆగస్టు 15 తర్వాత జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, నాగర్‌కర్నూల్ జెడ్పీ చైర్పర్సన్ శాం తకుమారి, మహబూబ్‌నగర్ జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధ్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.