మిడ్జిల్, డిసెంబర్ 25 : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం లో కులవృత్తులకు పూర్వ వైభవం సంతరించుకున్నది. నేడు మత్స్యకారులు, గౌడన్నలే కాదు కులవృత్తుల వారికి ఐదు వేళ్లు నోట్లోకి పోతున్నాయంటే అదే తెలంగాణ ప్రభుత్వ ర థసారథి కేసీఆర్ చలువే అంటున్నారు కులవృత్తుల వారు. మిషన్ కాకతీయ, హరితహారానికి తోడు 100శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ మత్స్యకారులను సంపన్నులుగా నిలిపుతున్నది.
నియోజకవర్గంలోని అన్ని మండలాల మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం 100శాతం సబ్సిడీపై చేపపిల్లల పం పిణీ అనూహ్య ఫలితాలను ఇస్తున్న ది. 2-3 దఫాలుగా వదిలిన చేప విత్తనాలు నేడు మత్స్యకారులకు సిరుల ను కురిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని 405 చెరువుల్లో 50 లక్షల చే పపిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసిం ది. జడ్చర్ల మండలంలోని 116 చెరువుల్లో 21 లక్షల చేపపిల్లలు, బాల్నగ ర్ మండలంలోని 60 చెరువుల్లో 8 లక్షలు చేపపిల్లలు, రాజాపూర్ 48 చెరువుల్లో 4 లక్షలు చేపపిల్లలు, నవాబుపేట మండలంలోని 134 చెరువుల్లో 11లక్షల చేపపిల్లలు, మిడ్జిల్ మండలంలోని 47 చెరువులుకు ఆరు లక్షల చేపపిల్లలు వదిలిన్నట్లు మత్స్యకారుల సంఘం నాయకులు తెలిపారు.
మండలకేంద్రంతోపాటు కొత్తూర్, చిల్వేర్, అయ్యవారిపల్లి, వేముల పెద్ద చెరువు వంటి చెరువుల్లో ఇప్పటికే 5 నుంచి 15 కిలోల వరకు ఒక్కొక చేప లభించడం గమనా ర్హం. శని, ఆదివారాలతోపాటు వారంలో దాదాపు చేపల వేటలో మత్స్యకారులు బిజిబిజిగా గడిపేస్తున్నారు. ఈసారి మత్స్యశాఖ నుంచి చెరువుల్లో కట్ల, రవ్య, బంగారు తీగ, శీలావతి, బోచ్చ వంటి రకాల చేపపిల్లలును వదిలినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
కులవృత్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది సీఎం కేసీఆర్. ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదు. చెరువులు, కుంటలు అభివృద్ధి చేయడంతోపాటు సబ్సిడీపై చేప విత్తనాలను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయ నుంచి చె రువులను అభివృద్ధి చేయడం జరిగింది. 100శాతం సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ, వాహనాలు. వలలు, బోట్లు, తెప్పలు వంటి పరికరాలు, పనిముట్లు అందించడం జరిగింది.
– తెలుగు సత్తయ్య, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి