MLA Vakiti Srihari | మాగనూరు, మార్చి 20: విద్యార్థులకు చదువు ఎంతయితే ముఖ్యమో క్రమ శిక్షణ కూడా అంతే ముఖ్యంగా భావించి ఉపాధ్యాయులు విద్యాబోధన చేపట్టాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ ఆయన మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ మండలం నల్లగట్టు దగ్గర ఉన్న కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని 8:50 నిమిషాలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తాను వచ్చే సమయానికి విద్యార్థులు ఇష్టానుసారంగా ఆడుతూ ఉండడం చూసి.. చదువులతోపాటు క్రమశిక్షణ కూడా విద్యార్థులకు చాలా ముఖ్యమని.. ఎమ్మెల్యే అక్కడున్న ఉపాధ్యాయులకు సూచించారు. వసతి గృహంలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నిర్మొహమాటంగా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులతో అన్నారు.
అనంతరం విద్యార్థులతో కలిసి ఉదయం ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రార్థన సమయంలో డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయులు తప్ప ఏ ఒక్కరూ లేకపోగా ప్రార్థన సమయానికి ఒక్కొక్కరు వస్తూ ఉండడం చూసి ఉపాధ్యాయులు ప్రార్థన సమయానికి ఐదు నిమిషాల ముందే చేరుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. 8:50 నిమిషాల నుండి దాదాపు 9:30 నిమిషాల వరకు పాఠశాల సమస్యలపై ఆరా తీశారు.
విద్యార్థులకు త్రాగునీటి కొరకు ఆర్వో ప్లాంట్ ఉండేదని అయితే మరమ్మతులకు నోచుకోక మూలన పడి ఉందని ఆర్ఓ ప్లాంట్ మంచిగా చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. త్వరలోనే చేయిస్తానన్నారు. అలాగే పాఠశాలకు మైక్ సెట్ వితరణ కూడా చేయాలని కోరగా.. మైక్ సెట్ వితరణ రేపు చేస్తానని ఉపాధ్యాయులకు సూచించారు.
క్రమశిక్షణతో కూడిన విద్య అందించాలి:
అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని అన్నారు. అనుక్షణం విద్యార్థులకు అందుబాటులో ఉపాద్యాయులు ఉండాలని సూచించారు. రేపు శుక్రవారం నుండి నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో హాజరై ఉన్నతమైన ర్యాంకులు సాధించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మక్తల్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గణేష్ కుమార్, ఉపాధ్యాయ బృందం, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు