డిండి ప్రాజెక్టుతో పాలమూరు రైతులకు నష్టం
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీటి చౌర్యం ఏర్పడి ఉమ్మడి పాలమూరు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమకారుల నియోజకవర్గ జెఏసీ చైర్మన్ షేక్ హు సేన్ వలీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడును కలిసి వినతిపత్రం అందజేశారు.
- పీఎల్ఆర్ఐను పూర్తిచేసి సాగునీటిని అందజేయాలి
- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు వినతిపత్రం అందజేసిన మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకులు
అలంపూర్, మే 17 : డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీటి చౌర్యం ఏర్పడి ఉమ్మడి పాలమూరు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమకారుల నియోజకవర్గ జెఏసీ చైర్మన్ షేక్ హు సేన్ వలీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి పథకం పనులు వెంటనే పూర్తి చేసి జాతీయహోదా కల్పించాలన్నారు. పీఎల్ఆర్ఐను పూర్తి చేస్తే ఉమ్మడి పాలమూరు రైతులకు సాగునీటికి ఢోకా ఉండదన్నారు. పాలమూరు జిల్లా రైతులకు నష్టం కలిగించే డిండి ప్రాజెక్టు ప నులను నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ వెంకట్రామయ్య శెట్టి, మున్సిపల్ చైర్మన్ పిండి జయరాముడు, మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్, జోగుళాంబ ఆలయ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీసీఎస్ మాజీ చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

