బంక్యూ.. ఊట్కూరులో డీజిల్ కొరత
నాగర్‌కర్నూల్ జిల్లాలో సోమవారం డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తాడూరు, తెలకపల్లి, బిజినేపల్లి వంటి మండలాల్లోని బంకుల్లో డీజిల్ లేకపోవడంతో రైతులు, వాహనదారులు జిల్లా కేంద్రానికి పరుగుతీశారు. దీంతో డీజిల్ స్టాక్ ఉన్న ఒకే బంకుల్లో (పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే..) వాహనదారులు, రైతులు, వినియోగదారులు డబ్బాలు, క్యాన్లు పట్టుకొని బారులుదీరారు.
- నాగర్‌కర్నూల్, ఊట్కూరులో డీజిల్ కొరత
- బంక్ వద్ద వాహనాల బారులు
- క్యాన్లు, డబ్బాలతో పడిగాపులు
- ధరలు పెంచి కొరత సృష్టిస్తున్నారంటూ ఫైర్
నాగర్‌కర్నూల్, జూన్ 1 : నాగర్‌కర్నూల్ జిల్లాలో సోమవారం డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తాడూరు, తెలకపల్లి, బిజినేపల్లి వంటి మండలాల్లోని బంకుల్లో డీజిల్ లేకపోవడంతో రైతులు, వాహనదారులు జిల్లా కేంద్రానికి పరుగుతీశారు. దీంతో డీజిల్ స్టాక్ ఉన్న ఒకే బంకుల్లో (పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే..) వాహనదారులు, రైతులు, వినియోగదారులు డబ్బాలు, క్యాన్లు పట్టుకొని బారులుదీరారు.
పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంకులో మాత్రమే డీజిల్ ఉండడంతో పో లీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వైపున కు ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు క్యూకట్టాయి. దాదాపు రెండు, మూడు గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగింది. పెద్ద మొత్తంలో వాహనాలన్నీ రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

06
జిల్లాలోని బంకులకు సోమవారం రావాల్సిన స్టాక్ సమయానికి రాకపోవడంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిల్లింగ్ స్టేషన్ వద్ద రద్దీ ఏర్పడింది. నల్లవెల్లి రోడ్డులో ఉన్న సబ్‌జైల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంకులో సైతం డీజిల్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందు లు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా పొలాల్లో పనులు చేసుకోవాల్సిన రైతులు డీజిల్ కోసం గంటల తరబడి ఎదురుచూశారు. పెట్రో, డీజిల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచేందుకే కొరత సృష్టిస్తుందని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పంటల సాగు సీజన్ ప్రారంభంలో ట్రాక్టర్లు, ఇతర యంత్రాలతో దుక్కులు దున్నుకునే సమయంలో ఇలా డీజిల్ కొరత సృష్టించడం తగదని రైతులు పేర్కొంటున్నారు. వెంటనే డీజిల్ కొరత లేకుండా చూడాలని పలువురు రైతులు, వాహనదారులు కోరారు.
నారాయణపేట జిల్లాలో..
పేట జిల్లా ఊట్కూరులోనూ పెట్రోల్, డీజిల్ కొరత నెలకొన్నది. మండల కేంద్రంలోని రెండు బంకుల వద్ద వాహనదారులు, కస్టమర్లు క్యూ కట్టారు. పోలీస్ బందోబస్తు మధ్య గంటల తరబడి క్యూలో నిలబడగా.. డీజిల్ దొరికింది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

