కొల్లాపూర్, ఫిబ్రవరి 21: పెద్దపల్లి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను వివిధ సెక్షన్ల పనితీరును పరిశీలించారు. అనంతరం ధరణి పెండింగ్ ఫైల్స్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధరణి పెండింగ్ ఫైల్స్ గురించి ఆరా తీశారు. పెండింగ్ ఫైల్స్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు అధికారులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
పెండింగ్ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని బన్సీలాల్ అధికారులను ఆదేశించారు. కుల ధృవీకరణ, జనన ధృవీకరణ పత్రాల కోసం వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేయాలని సూచించారు. భూముల రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పని చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో తహశీల్దర్ జేకే మోహన్, డిప్యూటీ తహశీల్దార్ రమేష్ నాయక్ ఉన్నారు.