మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 4 : ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఉమ్మడి జిల్లా ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా కృషి చేయాలని సూచించారు. పంక్షనల్ వర్టికల్ కచ్చితమైన అమలు చేయాలని, కేసుల విచారణలో పురోగతి ఉండాలని ఆదేశించారు.
నేరస్తులపై పీడీయాక్ట్ నమోదుకు తీసుకోవాల్సిన చర్యలు, హైకోర్టు స్పెషల్ జీపీ ముజీబ్ కేసుల విచారణపై సూచనలు చేశారు. అనంతరం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఉమ్మడి జిల్లా ఎస్పీలతో సమావేశమై మాట్లాడుతూ జిల్లాల్లో నేరాల నియంత్రణకు కృషి చే యాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారికి అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో ఎస్పీ లు నర్సింహ, మనోహర్, సృజన, వెంకటేశ్వర్లు ఉన్నారు.