అలంపూర్, అక్టోబర్ 10 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం జోగుళాంబ ఆలయంలోని గర్భాలయం ఎదుట అమ్మవారు మహాగౌరిదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. యాగశాలలో చంఢీహోమాలు, రథోత్సవం నిర్వహించారు. అలాగే పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం, కంచి కామాక్షి, యాగ నారసింహస్వామి ఆలయాల్లో అమ్మవారికి విశేష పూజలు చేసినట్లు ఆలయ ఈవో పురేందర్కుమార్, పాలక మండలి కమిటీ చైర్మన్ నాగేశ్వర్రె డ్డి తెలిపారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.
శ్రీశైలం, అక్టోబర్ 10 : శ్రీశైలంలో భ్రామరీ అమ్మవారు మహాగౌరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చినట్లు ఈవో పెద్దిరాజు తెలిపా రు. నందిని వాహనంగా చేసుకొని నాలుగు చేతుల్లో వర, అభయ ముద్రలతోపాటు త్రిశూలం, ఢమరుకాన్ని ఆయుధాలుగా ధరించి దివ్యకాంతులను ప్రసరింపజేస్తూ తెల్లని రంగులో శాంతస్వరూపిణిగా కరుణించారు. నందివాహనంపై ఆసీనులైన స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. పురవీధుల్లో గ్రామోత్సవంలో విహరించారు.