బాలానగర్, ఫిబ్రవరి 15: బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దాయపల్లి జాతీయ రహదారిపై నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుక లో ఎమ్మెల్యే బుధవారం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా జడ్చర్ల నియోజకవర్గ సేవాలాల్ ప్రీమియర్ లీ గ్ క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిచిన పలుగుమీదితండా టీం కు బహుమతులు అందజేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో బీఆర్ఎస్ వర్కింగ్ మండల అధ్యక్షుడు బాలూనాయక్ 300మంది విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ కమల, జెడ్పీటీసీ కల్యాణి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ మంజూనాయక్, ఎంపీటీసీ, సర్పంచులు పాల్గొన్నారు.
సేవాలాల్ మార్గంలో నడుచుకోవాలి
గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో నిర్మిస్తున్న సేవాలాల్ ఆలయ ఆవరణలో గిరిజనులతో కలిసి భవానీమాత, సే వాలాల్ మహరాజ్‌కు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తుదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్మన్ వాల్యానాయక్, జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీల, బాలానగర్ ఎంపీపీ కమల, జెడ్పీటీసీ మో హన్నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ బచ్చిరె డ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబం ధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, సేవాలాల్ ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కోయిలకొండలో భవన నిర్మాణం
మండలకేంద్రంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సహకారంతో సంత్ సేవాలాల్ భవనాన్ని ని ర్మిస్తున్నట్లు సర్పంచ్ కృష్ణయ్య తెలిపారు. మండలకేంద్రం లో బుధవారం సంత్ సేవాలాల్ జయంతిలో పాల్గొని మా ట్లాడారు. మండలకేంద్రంలో గిరిజనులకు వేయి గజాల భూమిని ఎమ్మెల్యే కేటాయించారని.. త్వరలో భవన పను లు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చె ర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు వి. శ్రీనివాస్‌రెడ్డి, కన్వీనర్, సర్పంచ్, నాయకులు పాల్గొన్నారు.
అన్నారెడ్డిపల్లిలో..
సేవాలాల్ మహరాజ్ జయంతిని మండలంలోని అన్నారెడ్డిపల్లి గ్రామంలో గిరిజనులు బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీదేవి మాట్లాడుతూ గిరిజనుల శ్రేయస్సు కోసం సేవాలాల్ చూపిన మార్గం ఆదర్శనీయమన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
గిరిజనుల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెద్దతండా శివారులో ఉన్న సేవాలాల్ ఆలయంలో జయంతి వేడులకను నియోజకవర్గ ఎస్టీసెల్ అధ్యక్షుడు రామురాథోడ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొత్తగా నియోజకవర్గంలోని తండాలకు బీటీరోడ్లు మంజూరు చేయాలని రూ.30కోట్ల ఎస్టిమేషన్ తయారు చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, తాసిల్దార్ చెన్నకిష్టన్న, కౌన్సిలర్లు బాలకోటి, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్సవకమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నవాబ్‌పేటలో..
మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డులో బుధవారం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే గిరిజనుల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. యన్మన్గండ్ల నల్లరాళ్లగుట్ట వద్ద సేవాలాల్ ఆలయం నిర్మాణానికి తమవంతు సహాయం అందజేస్తామన్నారు. అంతకుముందు గిరిజన యువకులు మండలకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, రైతుబంధు మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ వైస్‌చైర్మన్ చందర్‌నాయక్, సేవాలాల్ ఉత్సవకమిటీ అధ్యక్షుడు లింబ్యానాయక్, గౌరవ అధ్యక్షుడు శంకర్‌నాయక్, సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మిడ్జిల్‌లో..
లంబాడీల మార్పు కోసం కృషి చేసిన ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ అని జెడ్పీసీఈవో జ్యోతి, జెడ్పీటీసీ శశిరేఖ పేర్కొన్నారు. మండలకేంద్రంలో గిరిజన, లంబాడీ నాయకులు సమక్షంలో గురువారం పూజలు నిర్వహించారు. అంతకుముందు గిరిజన నాయకులు మండలకేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఎస్సై రాంలాల్‌నాయక్, శ్రీనూనాయక్ తదితరులు పాల్గొన్నారు.