దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్ సాగర్‌లో ఆదివారం సాయంకాలం వరకు అందిన సమాచారం మేరకు 31.7 అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 32.6 అడుగులు(2.27 టీఎంసీలు).
కాగా ప్రస్తుతం 31.7 అడుగుల వద్ద ఉంది. కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా పంట పొలాలకు సాగు నీటి విడు దల కొనసాగుతుంది. అదేవిధంగా నారాయణపేట, కొడంగల్, మద్దూర్ మండలాలకు 10 క్యూసెక్కుల నీరు త్రాగునీటి అవసరాలకై తరలింపు కొనసా గుతుంది.