రామ్ పోతినేని నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘RAPO 23’(వర్కింగ్ టైటిల్). రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయిక. తాజా షెడ్యూల్లో భాగంగా నెట్ ఎఫెక్ట్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కించారు. కిలోమీటర్ మేర విస్తరించిన ఓ ప్రాంతాన్ని లైట్స్‌తో నింపి, ఓ అద్భుతమైన విజువల్ క్యాన్వాస్ని సృష్టించారు.
ఈ భారీ సెటప్‌కు సంబంధించిన ఫ్లైట్ వ్యూ చూస్తేనే సీక్వెన్స్‌ను ఎంత గ్రాండ్‌గా తీశారో అర్థమవుతుంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ కెవిన్ ఈ సీక్వెన్స్‌ని డిజైన్ చేయగా, డీవోపీ తిరునావుక్కరసు ఈ విజువల్స్‌ని చిత్రీకరించారు. దర్శకునిగా రామ్ పోతినేని విజన్ ఏంటో ఈ సీక్వెన్స్ తెలియజేస్తుందని చిత్రబృందం చెబుతున్నది. రెండో షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్ పీఎస్, నిర్మాణం: రాపో సినిమాటిక్స్.