ఆదిలాబాద్ రిమ్స్‌లో అంతులేని విషాదం
ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని నిమ్స్ వైద్యులు నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని పలు దవాఖానలకు అంబులెన్స్‌లో తరలించారు. చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రిమ్స్ దవాఖానలోని స్పెషల్ నియోనేటల్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో 27 మంది నవజాత శిశువులకు వైద్యం అందిస్తున్నారు.
- షార్ట్ సర్క్యూట్‌తో ముగ్గురు చిన్నారుల మృతి
- అస్వస్థతలో మరో 24 మంది చిన్నారులు
- ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ దవాఖానలకు తరలింపు
- ఆందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు
- చిన్నారుల మృతిపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
- మరణాలు ప్రభుత్వ హత్యలే: జోగు రామన్న
- బాధ్యులపై చర్యలు: మంత్రి దామోదర
ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ)/హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని నిమ్స్ వైద్యులు నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని పలు దవాఖానలకు అంబులెన్స్‌లో తరలించారు. చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రిమ్స్ దవాఖానలోని స్పెషల్ నియోనేటల్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో 27 మంది నవజాత శిశువులకు వైద్యం అందిస్తున్నారు.
సోమవారం అర్ధరాత్రి సమయంలో ఎస్‌ఎన్‌సీయూలో ఉన్న మూడు ఏసీలు షార్ట్ సర్క్యూట్ కారంగా ఒకదాని తర్వాత ఒకటి కాలిపోగా.. గదుల్లో దట్టమైన పొగ అలుముకున్నది. ఏసీల నుంచి వస్తున్న పొగతో చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు, సిబ్బంది, తల్లిదండ్రులు చిన్నారులను వెంటనే బయటకు తీసుకురాగా.. కొద్ది సేపటికే ఐదు రోజుల ఆడ శిశువు మరణించింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న 24 మంది చిన్నారులను ఆదిలాబాద్‌తోపాటు నిర్మల్, నిజామాబాద్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు అంబులెన్స్‌లో తరలించారు.
చికత్స పొందుతూ మంగళవారం ఉదయం మరో ఇద్దరు శిశువులు మరణించారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పెషల్ నియోనేటల్ కేర్ యూనిట్లో ఏసీల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఏసీలను 24 గంటలు ఉపయోగించడం, ఏడాదిన్నర కిందట ఏర్పాటు చేసినా వాటి సామర్థ్యాన్ని పరీక్షించకపోవడంతోపాటు అధిక లోడ్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.
యూనిట్లో రెండు గదులు ఉండగా లోనికి రావడానికి, బయటకు పోవడానికి ఒకే దారి ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నదని పేర్కొంటున్నారు. రిమ్స్ ఎస్ఎన్సీయూను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం, అధికారుల వైఫ్యలం కారణంగా రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూలో అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు శిశువులు చనిపోయారని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తంచేశారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్తో కలిసి రిమ్స్‌ను సందర్శించి మాట్లాడారు. శిశువులకు వైద్యం అందించే యూనిట్లో పలు లోపాలు ఉన్నాయని, ఏసీల పనితీరు పరిశీలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉదాసీనత వైఖరి కారణంగా రోగులకు వైద్యం సరిగా అందడం లేదని, మందులు కొరత కారణంగా రోగుల బయట కొనుగోలు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మార్చురీలో శిశువు మృతదేహాన్ని పరిశీలించారు.
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే చిన్నారులు బలి: కేటీఆర్
రిమ్స్‌లో విద్యుత్తు షార్ట్ సర్యూట్ కారణంగా ముగ్గురు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన మరో 23 మంది చిన్నారులకు తక్షణమే నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వైద్యరంగాన్ని పూర్తిగా విస్మరించడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని మండిపడ్డారు. అభంశుభం తెలియని పసికందులు అన్యాయంగా బలైపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో నెలకొన్న అధ్వాన పరిస్థితులు, నిర్వహణ లోపాలపై బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం పలుమార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినా యంత్రాంగంలో కనీస చలనం లేకపోవడం క్షమించరాని నేరమని ధ్వజమెత్తారు. పకడ్బందీ భద్రతా చర్యలు ఉండాల్సిన చిన్నపిల్లల వార్డులు, ఐసీయూల నిర్వహణను గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను సర్వనాశనం చేసిన రేవంత్‌రెడ్డే ఈ దుర్ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానల్లోని పిల్లల వార్డులు, ఐసీయూలను నిపుణులతో తనిఖీ చేయించాలని, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

