మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 24 : తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి ధాన్యపు భాండాగారంగా మారిందని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగానికి పెద్దపీట వేయడంతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రతి రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పం డించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే శాఖాపూర్, తిమ్మాయిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కార్యక్రమం లో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, రైతుబం ధు సమితి మండల అధ్యక్షుడు బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మద్దూరి జితేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ శెట్టినాయక్, ఏవో శ్రీనివాసులు, ఏపీఎం సుదీర్‌కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమూద్, ఆలయ కమి టీ చైర్మన్ రమేశ్‌గౌడ్, సర్పంచులు కల్పనావిజయకుమార్రెడ్డి, జయన్నగౌడ్, ఆంజనేయు లు, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, కృష్ణయ్య, నరేందర్, సత్యనారాయణరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, రంజిత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఎమ్మె ల్యే ఆల సూచించారు. మూసాపేట మం డలం జానంపేటలో ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎం పీపీ గూపని కళావతీకొండయ్య, సింగిల్విం డో చైర్మన్ బండ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, ఏవో రాజేందర్‌రెడ్డి, సర్పంచులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, ఎంపీటీసీ నక్క ఆంజనేయులు, శివరాములు, బాలన్న, మల్ల య్య, అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), ఏప్రిల్ 24: ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నదని ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, పీఏసీసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి అన్నారు. కౌకుంట్ల, అప్పంపల్లి గ్రామాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు లు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ బ్రహ్మంగౌడ్, వైస్‌ఎంపీపీ సుజాత, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ మనోహర్‌రెడ్డి, సిం గిల్‌విండో చైర్మన్ నరేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, పీఏసీసీఎస్ డైరెక్టర్ కృష్ణగోపాల్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ దశరథరెడ్డి, ఏఈవో శ్రీనివాసులు, సీఈవో శ్రీనివాసులు, అశోక్‌రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర, ఏప్రిల్ 24 : ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి పథకాలను అమ లు చేస్తున్నదని ఎంపీపీ రమాదేవీశ్రీకాంత్యాదవ్, సహకార సంఘం చైర్మన్ నరేందర్‌రెడ్డి అన్నారు. దేవరకద్ర, గోపన్‌పల్లి, డోకూర్ గ్రామాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయావెంకటేశ్, ఏవో రాజేంద్ర అగర్వల్, సీఈ వో శ్రీనివాసులు, రైతుబంధు సమితి మండ ల అధ్యక్షుడు కొండారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, కొండా శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సత్యంసాగర్, బాలరాజు, యుగేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మిడ్జిల్, ఏప్రిల్ 24 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మిడ్జిల్, బోయిన్పల్లి గ్రామాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు నారాయణరెడ్డి, రాధిక, ఎంపీటీసీ గౌస్, పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ అల్వాల్‌రెడ్డి, డైరెక్టర్ జంగమ్మ, స ర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జంగిరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, బాలు, వెంకట్‌రెడ్డి, భద్రయ్య, లింగమయ్య, కరుణాకర్‌రెడ్డి, సురే శ్, గోపాల్, తిరుపతినాయక్ పాల్గొన్నారు.