రాజాపూర్, ఏప్రిల్ 20 : పార్లమెంట్ ఎన్నికల్లో అ త్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకొని విధ్వంసానికి గురవుతున్న తెలంగాణ అభివృద్ధిని కాపాడుకుందామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపుని చ్చారు. శనివారం రాజాపూర్‌లోని జేకే ప్యాలెస్‌లో ఉ మ్మడి బాలానగర్, రాజాపూర్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యమ నేత కేసీఆర్ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కొట్లాడి సా ధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో పదేండ్లలో అభివృద్ధి చేశారన్నారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావని, ప్ర జలు కూడా వీరిపై విసిగిపోయారన్నారు. ఏ పల్లెకు పో యినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామన్న భావన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్ చేతగానితనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో తెలిపించాలని కోరారు.
రైతుల పక్షపాతి కేసీఆర్..
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణను అన్నపూర్ణగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతుల సం క్షేమం కోసం అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. పదేండ్ల పాలనలో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు, మార్కె ట్లో ధాన్యపు రాసులు కనిపించేవన్నారు. నేడు కాంగ్రెస్ పాలనలో కరువు స్పష్టంగా కనబడుతుందన్నారు. పం టలు ఎండిపోయి రైతులు అరిగోస పడుతున్నరన్నారు. సీఎం రేంవత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ను మరిచి పాలన చేతకాక కేసీఆర్, కేటీఆర్‌లపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. రెండు నదులు చెంతనే పారుతున్నా ప్రజలకు నీళ్లు ఇవ్వలేని జాతీయ పార్టీలు మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించాలన్నారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించారని, మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో తాగేందుకూ మంచినీళ్లు లేక బిందెలతో రోడ్లపైకి వచ్చే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీలు బోగస్..
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు బోగస్ అని తేటతెల్లమైందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలను మరోసారి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన మంచి పనులను ప్రజల గుం డెల్లో నిలుపుకొన్నార న్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి మన్నెను గె లిపించి కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు శ్రీశైలంయాదవ్, శ్రీనివాస్‌రావు, మాజీ ఎం పీపీ నర్సింహులు, బచ్చిరెడ్డి, అభిమన్యురెడ్డి, చెన్నారెడ్డి, గోపాల్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మన్నెను గెలిపించుకుందాం..
నారాయణపేట, ఏప్రిల్ 20 : పాలమూరు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్‌లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సన్నాహక సమావేశానికి నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి భారీ మెజార్టీ సాధించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను వివరించాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రవీందర్‌రెడ్డి, మండలాల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
మోసకారి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
నర్వ, ఏప్రిల్ 20 : మోసకారి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన నర్వలో జరిగిన సన్నాహక సమావేశానికి రాజేందర్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కొట్లాడి సాధించిన రా ష్ర్టాన్ని పదేండ్ల పాలనలో కేసీఆర్ సుభిక్షం చేశారని, దేశ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. దేశంలో రైతులకు గౌరవం దక్కిందంటే కేవలం కేసీఆర్ పాలనలోనే అన్నారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ తన అసమర్థతను నిరూపించిందని, ప్రజలు మరోసారి ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మన్నెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అసమర్ధ పాలనలో పాలమూరు ఎడారి..
పదేండ్లు పచ్చని పంటలతో కళకళలాడిన పాలమూరు కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలతో మక్తల్ నియోజకవర్గం ఎడారిగా మారుతుందన్నారు. స్థానికుడైన మన్నె శ్రీనివాస్‌రెడ్డి కేసీఆర్ సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు. మరోసారి ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ని యోజకవర్గ నాయకుడు ఆసిరెడ్డి, మ క్తల్ మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ నర్సింహులు గౌడ్, ఎంపీపీ జయరాములుశెట్టి, సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మహేశ్వర్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.