బిజినేపల్లి, మార్చి 29 : బిజినేపల్లిలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు ఆల్ సెయింట్స్ మోడల్‌స్కూల్, పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం జరిగిన పదో తరగతి బయోసైన్స్ పరీక్షా కేంద్రాలను డీఈవో రమేశ్‌కుమార్ శనివారం ఆకస్మి క తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాస్‌కాపీయింగ్ కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. పరీక్షలకు వచ్చే విద్యార్థులకోసం తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, విద్యుత్‌సరఫరాపై ఎలాంటి అవకతవకలు జరగకుండా ఏర్పాటు చేశారని పరిశీలించారు.
ప్రతివిద్యార్థిని తనిఖీ చేసి పరీక్షా కేంద్రానికి పంపాలన్నారు. అదేవిధంగా సెల్ఫోన్లను పరీక్షా కేంద్రాలకు అనుమతించరాదన్నారు. పాలెం పరీక్షా కేం ద్రంలో 206, బిజినేపల్లి బాలికల పాఠశాలలో 170, ఆల్ సెయింట్స్ పాఠశాలలో 200 మంది పరీక్షకు హాజరయ్యా రు. కాగా బిజినేపల్లిలో బాలుర ఉన్నత పాఠశాలలో మా త్రం 156 మందికి 155 హాజరుకాగా, ఒకరు గైర్హాజరయ్యారు. వీరి వెంట చీఫ్ సూపరింటెండెంట్ నరహరి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అంజయ్య తదితరులు ఉన్నారు.
కల్వకుర్తి రూరల్, మార్చి 29 : కల్వకుర్తి పట్టణంతో పాటుగా మండలంలోని మార్చాల గ్రామంలోని పది ప రీక్షాకేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం విద్యార్థులు బయోలజీ పరీక్షను రాశారు. 8 ప రీక్షా కేంద్రాల్లో 1581మందికి 1576 హాజరుకాగా 5 మంది విద్యార్థులు గైర్హాజరైనారని పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఎంఈవో శంకర్‌నాయక్ తెలిపారు.
చారకొండ, మార్చి 29 : మండలకేంద్రంలో జెడ్పీ ఉ న్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పది పరీక్షలు ప్రశాంతం గా కొనసాగుతున్నాయని ఎంఈవో ఝాన్సీరాణి అన్నా రు. శనివారం నిర్వహించిన బయోసైన్స్ పరీక్షకు 177 మందికి అందరూ విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షాకేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై శంషొద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ బం దోబస్తు ఏర్పాటు చేశారు. వారివెంట కార్యాలయ సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.