వణికిస్తున్న జ్వరాలు
ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరంతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మంచానపడ్డారు.
- పాలమూరును చుట్టముట్టిన సీజనల్ వ్యాధులు
- జనరల్ దవాఖానకు పెరుగుతున్న రోగుల తాకిడి
- జిల్లాలో ఇప్పటి వరకు 233పైగా డెంగీ కేసులు నమోదు
- ఆగస్టు నెలలోనే 123 మందికి డెంగీ
- నివారణ చర్యలపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం
మమబూబ్‌నగర్, సెప్టెంబర్ 14 : ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరంతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మంచానపడ్డారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు అనే తేడా లేకుండా విష జ్యరాలతో బాధపడుతున్న వారితో నిండిపోయాయి. పది రోజులుగా జనరల్ దవాఖానకి వచ్చే రోగుల సంఖ్య 1600 నుంచి 2 వేల వరకు పెరిగింది. ప్రైవేట్ దవాఖానలో కూడా భారీగానే కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో చాలా మంది డయేరియా, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు.
మెరుగైన వైద్యం అందక..
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) మెరుగైన వైద్యం అందక జనరల్ దవాఖానను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇక్కడ సాధారణ జ్వరాలు, ఒంటి నొప్పులు ఇతర సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. అయితే నిత్యం ఎక్కువ మంది రోగులు వస్తుండడంతో వైద్యులు హడావుడిగా చికిత్స చేస్తూ చేతులు దులుపుకొంటున్నా రని రోగులు వాపోతున్నారు. నాడిపట్టి పరీక్షించి రోగితో సమస్య తెలుసుకునే పరిస్థితి లేదని, సాధారణ పరీక్షలు నిర్వహించి తోచిన మందులు ఇచ్చి పంపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
మొక్కుబడి చర్యలతో సరి..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వానకాలం పక్కా ప్రణాళిక కొరవడుతోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో రోగుల తాకిడికి అనుగుణంగా సేవలందిడం లేదు. వాన నీరు సాఫీగా పోయేందుకు చర్యలు తీసుకోవాల్సిన మున్సిపాలిటీ వారు మాత్రం మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారు. పారిశుధ్యం, దోమల నివారణకు ఏటా సీజన్లో రూ.3 కోట్ల మేర ఖర్చు పెడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. జిల్లా కేంద్రంలో కనీసం ఫాగింగ్ మిషన్లు కూడా ఉపయోగించడం లేదు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా, ఆ దిశగా ఆరోగ్యశాఖ చేపట్టడం లేదు. పట్టణంలో నిత్యం లక్ష మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, సేకరించడంలో జాప్యంతోనే వ్యాధులు ప్రబలడానికి కారణమవుతోంది.
పెరిగిన డెంగీ కేసులు
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 3వేల మందికి డెంగీ పరీక్షలు చేయగా 233 మందికిపైగా పాజిటివ్ వచ్చింది. కేవలం ఒక ఆగస్టు నెలలోనే 123 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 56 వస్తే జనరల్ దవాఖానలో 67 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలీస్తే ఈ సారి డెంగీ కేసులు భారీగా పెరగాయి.
సీజనల్ వ్యాధులు పెరిగాయి
వాతావరణ మార్పులతో ఒక్కసారిగా రోగుల తాకి డి పెరిగింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు. ప్రధానంగా వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువ, ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నిల్వ నీటి వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయి. వైద్యుల సూచన మేరకు మం దులు వేసుకోవాలి.
– డాక్టర్ శ్రావణ్‌కుమార్, జనరల్ ఫిజిషియన్, మహబూబ్‌నగర్ జిల్లా
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

