అయ్యోధ్యనగర్
గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే ఇండ్లపైకి బుల్డోజర్లు.. అడ్డుకొనేందుకు స్థానికుల యత్నాలు.. అప్పటికే మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడం.. కష్టపడి కట్టుకున్న నిర్మాణాలు నేలమట్టమవడం.. మిన్నంటిన స్థానికుల రో ధనలు.. అయోధ్యనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకున్నది.
- పేదల ఇండ్లపైకి 8 బుల్డోజర్లు
- అక్రమ నిర్మాణాలంటూ 34 కూల్చివేత
- పోలీస్ బందోబస్తు మధ్య నేలమట్టం
- మిన్నంటిన బాధితుల రోధనలు
- ప్రభుత్వం, అధికారులపై శాపనార్థాలు
చారకొండ, జూన్ 19 : గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే ఇండ్లపైకి బుల్డోజర్లు.. అడ్డుకొనేందుకు స్థానికుల యత్నాలు.. అప్పటికే మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడం.. కష్టపడి కట్టుకున్న నిర్మాణాలు నేలమట్టమవడం.. మిన్నంటిన స్థానికుల రో ధనలు.. అయోధ్యనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన సర్వే నెంబర్ 327లో 9.11 ఎకరాలు, మరో సర్వే నెంబర్ 328లో 7.06 ఎకరాల్లో 50 ఏండ్ల నుంచి ఎందరో ఇక్కడే ఉం టూ జీవనాధారం పొందుతున్నారు.
అయితే ఆలయ భూములను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని అధికారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో గతేడాది జనవరిలో ఆక్రమణలు తొలగించాలని కోర్టు తీర్పునిచ్చింది. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీ స్, ఎండోమెంట్ అధికారులు సమావేశమై వెంటనే కూల్చివేతలకు సిద్ధమయ్యారు. ఇండ్లవాసులకు ఒక్కరోజు గడువు ఇచ్చి.. ముగిసిన తర్వాత 8 జేసీబీలతో ఇండ్లపైకి వెళ్లారు. అప్పటికే భారీగా పోలీసులను ఆ ప్రాంతంలో మోహరించారు. కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, డీఎస్పీ వెంకటేశ్వర్లు, అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 34 నిర్మాణాలు అక్రమంగా నిర్మించారని గంటల్లోనే నేలమట్టం చేశారు.
కాళ్లావేళ్లాపడినా.. కనికరం లేకుండా..
సిరుసనగండ్ల పరిధిలోని అయోధ్యనగర్లో అక్రమంగా నిర్మించారని ఇండ్లను కూల్చివేస్తుంటే.. వద్దని బాధితులు అధికారులకు దండం పెట్టి.. కాళ్లా.. వేళ్లా పడ్డారు. అయి నా కనికరం లేకుండా కూల్చివేతలు కొనసాగించారు. అడ్డుకోవడానికి యత్నించినా పోలీసులు వారిని వారించారు. కొన్ని రోజులు సమయం ఇవ్వాలని వేడుకున్నా ఒప్పుకోలేదు.. కనీసం ఇండ్లల్లోని సామాన్లు కూడా తీసుకోకుండానే కూల్చివేతలు చేపట్టారు. దీంతో ఆలయ అధికారులు, ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టారు. ఇండ్లు కూలిపోతుంటే వారి రోధనలు వర్ణణాతీతం. మా ఇండ్లు కూల్చడంతో గూడు చెదిరిన పక్షులం అయ్యామని.. ఆ భగవంతుడు ఇలా చేస్తాడని అనుకోలేదని మహిళలు, వృద్ధులు కన్నీరుమున్నీరయ్యారు.
రాజకీయ కక్షతోనే ఇండ్లు కూల్చివేత : బీఆర్ఎస్
సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో మొత్తం నిరుపేదలకు చెందిన ఇండ్లనే కూల్చివేశారని, ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షతోనే జరిగిందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్, నేతలు రమేశ్, రామకృష్ణ, సలీం, శ్రీను ఆరోపించారు. బాధితులు సమయం ఇవ్వాలని కోరినా అధికారులు కనికరించలేదని, ప్రత్యామ్నా యం చూపకుండానే ఇండ్లను కూల్చి పేదలను రోడ్డున ప డేశారని ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇంటిస్థలాలు కే టాయించి.. ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశా రు. కూల్చివేతలను తాసీల్దార్ సునీత, ఎంపీడీవో ఇసాక్హుస్సేన్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి, ఈవో ఆంజనేయులు, సీఐలు విష్ణువర్ధన్రెడ్డి, నాగరాజు, నాగార్జున, ఎస్సై శంషొద్దీన్ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

