కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణన సర్వేతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పదేండ్ల కిందట 51శాతంగా ఉన్న బీసీల జనాభా కాంగ్రెస్ సర్కారులో 46 శాతానికి తగ్గించ డమేమిటని బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఓట్ల కోసమే తప్పా కులగణనపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఇందుకు తాజా నివేదికే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అగ్రకులాలకు అధికారం కట్టబెట్టాలనే ఉద్దేశంతో బీసీల సం ఖ్యను తక్కువ చేసి చూపించారని ఆరోపిస్తున్నారు. కాంగ్రె స్ బీసీ కులగణన చేపడుతామని, రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నే డు విస్మరించడం సిగ్గుచేటని బీసీలు నిరసన తెలుపుతు న్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కులగణన సర్వే తప్పుల తడకగా అదరా బాదరా చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ చెప్పి ప్రస్తుతం వారి ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నది. విద్యా, ఉద్యోగ రంగాల్లో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లను, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేసే కుట్రలో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 14నెలల రేవంత్ పాలనలో తెలంగాణలోని అన్నివర్గాల ప్రజలు అగ్రహంతో ఉన్నారు. -శ్రీనివాసులు,బీసీసంఘం నాయకులు
బలహీన వర్గాలను రేవంత్రెడ్డి ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. కులగణనకు శాస్త్రీయత లేకుండా పో యింది. మొక్కుబడిగా సర్వే చేయడంతో బలహీన వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదు. బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఏకోశాన లేదు. బీసీలకు అన్యాయం జరిగేతే సహించేది లేదు.