గద్వాల, నవంబర్ 29 : కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం సీఎం రేవంత్ తరం కాదని, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం అంటే అసెంబ్లీని, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చుతారా లేక కల్వకుర్తి, నెట్టెంపాడు, కాలేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులను కూల్చి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తారా అని మాజీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అధ్యక్షతన దీక్షా దివస్ కార్యక్రమంలో అలంపూర్ ఎ మ్మెల్యే విజయుడు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, రాష్ట్ర నాయకులు డాక్టర్ కు ర్వ విజయ్‌కుమార్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, బాసు హనుమంతునాయుడు పాల్గొన్నారు.
ముం దుగా పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ చేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభీషేకం చేశారు. ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ బీఆర్ఎస్ నాయకులను తొక్కుకుంటూపోతా అంటున్నారని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే మీరు సీఎం ఎలా అయ్యేవారని ప్రశ్నించారు. మీరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబును తొక్కుకుంటూ పోయి ముఖ్యమంత్రి అ య్యారని అది గుర్తించుకోవాలని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి సీఎం అయినప్పటికీ ఆయన భాషలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకుడిగా మారారని ఆరోపించారు. కేసీఆర్ వెంట నడిగడ్డలో పాదయాత్ర చేశానని పాదయాత్ర చేసే సమయంలో రాయలసీమ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆర్డీఎస్ తూములను పేల్చివేస్తామని హెచ్చరించారని దీనికి ప్రతీగా కేసీఆర్ స్పందించి మీరు ఆర్డీఎస్ను ధ్వంసం చేస్తే మే ము బాంబులతో సుంకేసులను పేల్చివేస్తామని హె చ్చరించాడని గుర్తు చేశారు.
పాదయాత్ర సమయం లో ఇక్కడి రైతులు, కూలీలు, ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను కేసీఆర్ స్వయంగా తెలుసుకున్నారు. ఇక్కడి వలసలను నివారించడానికి ఆర్డీఎస్ ఆధునికీకరణతోపాటు తుమ్మిళ్ల లిఫ్ట్, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తిచేసి వలసలు నివారించాడన్నా రు. తెలంగాణను దుష్టశక్తుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కుర్వ విజయ్‌కుమార్ అన్నారు. మన కోసం కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణను సాధించారన్నారు. రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉందని యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకుడిగా రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించామన్నారు.
కేసీఆర్‌కు ప్రజలే బలం బలగం అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు మాట్లాడుతూ ఆంధ్రపాలకుల సంకలు నాకిన వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ చరిత్ర ఒకరు చెరిపితే చె రిగి పోయేది కాదన్నారు. బాసు హనుమంతునాయుడు మాట్లాడుతూ గద్వాలలో ఒకే కుటుంబ పా లన ఉండడం వల్ల ప్రజలు ఎంతో నష్టపోయారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల, మున్సిపల్ చైర్పర్సన్ల్లు మనోరమ, కరు ణ, నాయకులు శ్రీధర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, కిశోర్, సంకాపురం రాముడు, అశోక్‌రెడ్డి, శ్రీరాములు, హ నుమంతురెడ్డి, ప్రేమలత, కుర్వ పల్లయ్య, మోనేశ్, శేఖర్, రంగు సుమలత, జనార్దన్‌రెడ్డి, రామకృష్ణ, రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నడిగడ్డ బీఆర్ఎస్ అడ్డా అని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఉమ్మడి జిల్లాలో అందరూ కాంగ్రెస్ వైపు చూస్తే నడిగడ్డ ప్రజలు మా త్రం కేసీఆర్ వైపు చూసి మమ్మల్ని గెలిపించారని చె ప్పారు. దీక్షా దివస్‌కు ఇం త పెద్ద ఎత్తున ప్రజలు స్వ చ్ఛందంగా వచ్చి విజయవంతం చేసినందుకు వారి కి కృతజ్ఞతలు తెలిపారు. న డిగడ్డ ప్రజలు ఎల్లప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటారని ప్రకటించారు.
చావును సైతం లెక చేయకుండా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, విద్యార్థుల బలిదానా లు, కులమతాలకు అతీతంగా ప్రజలు ఉద్యమాలు చే స్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్ర ఏర్పా టు ప్రకటన చేసిందన్నారు. కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలన్నారు. తెలంగాణ దేవత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని, ఇదే రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలిదేవతగా అభివర్ణించారని, పదవి ఇవ్వగానే తెలంగాణ తల్లి అ య్యిందా అని ధ్వజమెత్తారు.
నడిగడ్డ ప్రజల గుండెల నిండా గులాబీ జెండా గు ర్తు ఉందని రాష్ట్ర స్పోర్ట్స్ అ థారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అమలు కాని హా మీలు ఇచ్చి రైతులను మో సం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో యాసంగి రై తు బంధు కేసీఆర్ రైతుల ఖాతాల్లో జమచేసేవారని ప్రస్తుత సీఎం వానకాలం రైతుబంధు రైతులకు ఇవ్వలేదని, ప్రస్తుత యాసంగిపై ఊసేలేదని దీంతో రైతుల గుండె మండుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులు, కేసులకు భయపడొద్దని త్వరలో బీఆర్ఎస్ పా ర్టీ ఘన విజయం సాధిస్తుందని, మళ్లీ అధికారంలోకి వస్తామని, అంతవరకు ఓపికపట్టాలని కోరారు.