గద్వాల, నవంబర్ 26 : జిల్లాలో బీఆర్ఎస్కు తెగింపు ఉన్న కార్యకర్తలు ఉ న్నారని, వారే తమ బలమని దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. పార్టీలోకి చాలా మంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ, అసలైన కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తారన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సీనియర్ నాయకుడు హనుమంతునాయుడు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఇందుకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, రాష్ట్ర నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, విజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ 2009లో కేసీఆర్ తన ప్రాణాలు ఫణంగా పెట్టి దీక్ష చేపట్టి ఢిల్లీ కండ్లు తెరిపించడంతో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారన్నారు. దీనికి విజయసూచకంగా ఏటా నవంబర్ 29న దీక్షాదివస్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 29న రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రపై ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తామన్నారు.
తొలితెలంగాణ ఉద్యమం లో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినా అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పా టు చేయలేదన్నారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌కు ప్రజలతోపాటు విద్యార్థు లు, కార్యకర్తలు, మేధావులు సహకరించడంతో సుసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించారన్నారు. ఆర్డీఎస్ రైతుల సాగునీటి సమస్య, సీమాంధ్ర పాలకు లు బాంబులు వేసి షట్టర్లు ధ్వంసం చేయడం వంటి వాటిని స్వయంగా తెలుసుకునేందుకు కేసీఆర్ పాదయాత్ర చేపట్టాడని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ తెగింపు నేటితరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయక 11 రోజులు పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దడంలో సఫలీకృతుడు అయ్యాడని చెప్పారు. దీక్షాదివస్‌లో ప్రజలు, కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కేసీఆర్ ఢిల్లీ పెద్దల మెడలు వచ్చి తెలంగాణను సాధిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో ఇక్కడ సరైనా సాగునీటి వసతి లేక ఇక్కడి ప్రజలు ఇతర ప్రాం తాలకు వలస వెళ్లేవారిని అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణకు ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వలసవచ్చి జీవనం గడుపుతున్నారన్నారు. ఇక్కడి వలసలు ఇక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని వలసలు ఆపడానికి కేసీఆర్ పాదయాత్ర చేశారన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దీక్షబూని తెలంగాణ సాధించిన కేసీఆర్ విజయాలకు సూచకంగా దీక్షా దీవస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఢిల్లీ మెడలు వంచిన నాయకుడు కేసీఆర్ అన్నారు. మోదీ, చంద్రబాబు డైరెక్షన్లో తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు రైతు భరోసా అందక, రుణమాఫీ కాక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో నాయకులు అశోక్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, కుర్వ పల్లయ్య, బస్వరాజ్, కిశోర్‌కుమార్, శ్రీరాములు, బీచుపల్లి, ప్రేమలత, రాముడు, రహెమాన్, గోవర్ధన్, మోనేశ్, రాము, రాజు పాల్గొన్నారు.