వందేహం గణనాయకమ్’.. ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా’.. ‘గణపతి బొప్పా మోరియా’.. అన్న భక్తి పాటలు హోరెత్తాయి. సోమవారం చవితి సందర్భం గా మండపాల్లో వినాయకుడు కొలువుదీరాడు. వాడవాడలో వివిధ రూపాల్లో ప్రతిమలను భక్తులు ప్రతిష్ఠిం చి విశిష్ట పూజలు చేశారు. ఉండ్రాల పాయసం.. చెరుకు గడలను నైవేద్యంగా సమర్పించారు. విద్యుద్దీపాల కాంతులు.. అబ్బురపరిచేలా డెకరేషన్లు..
ఆలోచింపజేసేలా మండపాలను సుందరంగా ముస్తాబు చేశారు. ఈసారి మట్టి వినాయకులకు భక్తులు జై కొట్టారు. పాలమూరులో మండపాల వద్ద క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పూజలు చేశారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు గణేశులను దర్శించుకున్నారు.
– నెట్వర్క్ (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 19