వెల్దండ, ఫిబ్రవరి 28 : మండలంలోని గుండాల కోనేరులో శివరాత్రి రోజున గల్లంతైన జేపీనగర్ గురుకుల విద్యార్థి ఓమేశ్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. రెండురోజులపాటు కోనేటిలో ఎంత గాలించినా దొరకని మృతదేహం మూడోరోజు మ రో కోనేరులో లభ్యమైంది. ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం) బలగాలు రంగంలోకి దిగి మొదటి రోజు వి ద్యార్థి మునిగిన కోనేరులో లభ్యం కాకపోవడంతో సోరంగం ద్వారా మరో కోనేరుకు మృతదేహం కొట్టుకుపోయి ఉంటుందన్న అనుమానంతో రెండోరోజు మరో కోనేరులో వె తకగా 120 పీట్ల లోతులో మృతదేహం కన్పించడంతో ఎన్టీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ బృందం సభ్యులు పృథ్వీ, లవరాజ్ రిస్క్ చేసి కోనేరు సొరంగంలోకి దిగి మృతదేహాన్ని వెలికితీశారు.
తమకు న్యాయం చేయాలంటూ వి ద్యార్థి తల్లిదండ్రులు మృతదేహంతో ధ ర్నా నిర్వహించారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషి యా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల పొలం ఇవ్వాలని, ఇలాంటివి పునారావృతం కా కుండా ఆలయం, కళాశాలలో చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. బాధితులకు బీఆర్ఎస్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే కలెక్టర్‌తో మాట్లాడి రూ.10లక్షలు తక్ష ణ సాయంగా మంజూరు చేస్తామని హామీ ఇ చ్చినట్లు జేసీ యాదగిరి, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, తా సీల్దార్ ఇబ్రహీం తెలపడంతో ఆందోళన విరమించా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ద వాఖానకు తరలించి అక్కడి నుంచి స్వగ్రామం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం మున్ననూరుకు తరలించారు.