అలంపూర్, అక్టోబర్ 2 : కోటి లింగాలు కొలువై దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపు రం క్షేత్రం రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం, అలంపు రం) నాలుగు శక్తిపీఠాలుండగా విభజన అనంతరం అలంపురం జోగుళాంబ ఏకైక శక్తిపీఠంగా తెలంగాణలో ప్రసిద్ధికెక్కింది. రాజధానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో, గద్వాల జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్లు, కర్నూల్‌కు 30 కిలోమీటర్ల దూరంలో, తుంగభద్రా నది తీరంలో అలంపూర్ పుణ్యక్షేత్రం వెలిసింది. క్షేత్రాన్ని దర్శించుకునేందుకు రోడ్డు మార్గంతోపాటు రైలుమార్గం కూడా ఉంది. ఈ క్షేత్రంలో జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలతోపాటు నవబ్రహ్మ ఆలయాలు దర్శనమిస్తాయి.
కోటి లింగాలు కొలువైన క్షేత్రంలో లేని దేవతామూర్తంటూ లేడు. రేణుకాదేవీ భక్తులకు సంతానలక్ష్మిగా దర్శనమిస్తు ంది. ఇక్కడ కంచి కామాక్షి ఆలయం కూడా ఉన్నది. శతాబ్దాల చరిత్ర గల మ్యూజియంలోని శిల్ప సంపదను తిలకించడానికి వి దేశాల నుంచి సైతం యాత్రికులు వస్తుంటా రు. దక్షిణ కాశిగా, భాస్కర.. పరశురామ క్షేత్ర ంగా విరాజిల్లుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు ని ర్మాణ సమయంలో కృ ష్ణ, తుంగభద్ర నదుల సంగమం వద్ద ముంపునకు గురైన సంగమేశ్వరాలయాన్ని యథావిధంగా అవే రాళ్లతో.. అదే ఆకారం, అదే నమూనాతో ఆలయాన్ని పునః నిర్మించడం చరిత్రలో ఎక్కడా లేదు.
శైవక్షేత్రాలకు తలమానికంగా శ్రీశైలం క్షేత్రానికి పశ్చిమ ద్వారంలో అలంపూర్, ఉత్తర ద్వారంలో ఉమామహేశ్వరం, తూర్పున త్రిపురాంతకం, పడమరన సిద్ధవటం క్షేత్రాలు వెలిశాయి. సుమారు 1400 సంవత్సరాల కిందట బాదామి చాళుక్యుల కాలంలో రెండో అలంపూరంలో ఆలయాలను నిర్మించినట్టు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. క్షేత్రంలో ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మతో పాటు కుమారబ్రహ్మ, ఆర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, తారక బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ వంటి నవ బ్రహ్మాలయాలు కూడా నిర్మితమయ్యాయి.
ఈ ఆలయాల మీద అలనాటి సంసృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా నాటి అష్టదిక్పాలకులు, శివ, విష్ణు అవతారాలు, నటరాజు, పురాణ గాథలు తెలిపే శిల్ప సంపద, మరెన్నో శిల్పాలు ముగ్ధమనోహరంగా మలచబడ్డాయి. పంచతంత్ర, కావ్య కథా చిత్రాలు, ఆదిత్య హృదయం, రామాయణ, మహాభారత గాథలు తెలియజేసే ఎన్నో శిల్పాలు యాత్రికులకు కనువిందు చేస్తున్నాయి. మరికొన్ని శిల్పాలు మ్యూజియంలో భద్రపర్చారు.
జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు దక్షిణ దిశలో కొంతదూరంలో 24 ఆలయాల సముదాయం (పాపనాశిని ఆలయాలు) ఉన్నది. ఈ ఆలయాలు ద్రావిడ సాంప్రదాయానికి చెందినవిగా గుర్తించారు. ఆలయ స్తంభాలపై రామాయణ, మహాభారత, క్షీరసాగర మథనం గాథలు తెలియజేసే అపురూప శిల్పకళా చిత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి. 24 ఆలయాల్లోనూ భిన్నమైన శివలింగాలు, ప్రధాన ఆలయంలో ఆకుపచ్చ రంగులో శివలింగం దర్శనమిస్తుంది.
ప్రపంచంలో ఏ క్షేత్రంలో లేనివిధంగా ఇ క్కడ ప్రత్యేక ఆకారంలో రసలింగం ఉన్న ది. పూర్వం ఈ లింగం నుంచి కొన్ని ప్రత్యేకమైన రసాలు వెలువడుతుండేవి కాబట్టి దానికి రసలింగం అని, బ్రహ్మ తపస్సు చేస్తే పరమేశ్వరుడు ఉద్భవించాడు కాబట్టి బ్ర హ్మేశ్వరుడని, ఆకారం చిన్నగా ఉన్నందునా బాలబ్రహ్మేశ్వరుడని పలు పేర్లు వా డుకలో ఉన్నాయి.
గోమాత నేలపై పాదం మోపినప్పుడు ఎలాంటి నమూన ఏర్పడుతు ందో ఆ విధంగా (ఆవు గెట్టె పైభాగం ఆకారంలో)పై భాగం చీలిపోయినట్లు ఉంటుం ది. శివలింగం నుంచి వెలువడుతున్న విషయాన్ని గమనించిన కొందరు రససిద్ధులు పరశువేది అనే మూలిక సహాయంతో బంగారా న్ని చేసే వారని, అదే బంగారంతో ప్రధాన ఆలయాల చుట్టూ మరో ఎనిమిది ఆలయాలను నిర్మించినట్టు చరిత్ర చెబుతున్నది. అవే నవబ్రహ్మ ఆలయాలు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ఈవో పురేందర్‌కుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది అన్ని రకాలు చర్యలు చేపట్టారు. 3వ తేదీ గురువారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు ఉత్స వాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమి స్తుంది. ఉత్సవాల్లో పాల్గొనడానికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో తరలివస్తారు.
దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం ధ్వజారోహణం, 9వ తేదీ మూల నక్షత్రాన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణోత్సవం, 10న దుర్గాష్టమి పూజలు, అనంతరం జోగుళాంబ అమ్మవారి రథోత్సవం నిర్వహిస్తారు. 11వ తేదీన మహార్ణవమి రోజున కాళరాత్రి పూజలు, వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 9 గంటలకు భూదేవీ శ్రీదేవీ సహిత వేంకటశ్వరస్వామి కల్యాణోత్సవం కూడా నిర్వహించనున్నారు. 12వ తేదీ శనివారం దశమి రోజున విజయదశమి పూజలు, ఉదయం శేషవాహన సేవ. చివరిరోజు పూర్ణాహుతి, అవభృత స్నానం, సాయంత్రం 4 గంటలకు శమీ పూజ, సంధ్యా సమయంలో నదీ హారతి అనంతరం తుంగభద్ర నదిలో జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరుల స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు నదీ విహారంలో భాగంగా తెప్పోత్పవం నిర్వహిస్తారు. అనంతరం ధ్వజావరోహణంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.