జడ్చర్ల, సెప్టెంబర్ 12 : పెండింగ్‌లో ఉన్న పాలబిల్లు లు చెల్లించాలంటూ పాడి రైతులు గురువారం జడ్చర్లలోని సిగ్నల్‌గడ్డలో ప్రధాన రహదారిపై పాలడబ్బాలతో వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు రైతు లు జడ్చర్లలోని బీఎంసీ దగ్గరకు వెళ్లి పెండింగ్ డబ్బులు చెల్లించాలని అడుగగా బిల్లులు వచ్చిన వెంటనే ఇస్తామని అక్కడ పనిచేసేవారు చెప్పారు. ఇప్పటికే 5 బి ల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, అడిగినప్పుడల్లా ఇదే సమాధానం ఇస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి బీఎంసీ షటర్వేసి అక్కడే ఆందోళనకు దిగారు.
ఈ సమయంలో రెవెన్యుశాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్నారన్న విషయం తెలుసుకు న్న రైతులు జడ్చర్ల సిగ్నల్గడ్డకు రాగా అప్పటికే మంత్రి వెళ్లిపోవడంతో ధర్నాకు దిగారు. దాంతో చాలా సమ యం పాటు ట్రాఫిక్‌జాం అయింది. విషయం తెలుసుకున్న ఎస్సై శివానందం అక్కడికి చేరుకొని పాడిరైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భం గా రైతులు మాట్లాడు తూ విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు రెండు, మూడు నెలలుగా బిల్లులు రావ డం లేదన్నారు. పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించాల్సిన ప్రభుత్వం.. ఐదింటిని పెండింగ్‌లో ఉంచినట్లు తెలిపారు. దాదాపు రూ.3కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో ప్రతి 15 రోజులకోసారి బిల్లులు అందేవన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు సమయానికి రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలనెలా పొడిగిస్తూ రెండునెలలకు పైగా పెండింగ్‌లో ఉంచడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అడిగితే ఇవాళ రేపు అంటూ తిప్పుకొంటున్నారని, బిల్లుల కోసం రోడ్డెక్కినా అధికారుల్లో స్పందనలేదన్నారు. ఒక్కో పాడిరైతుకు రూ.50వేల నుంచి రెండు లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నా యన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించి రైతులకు ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.