ఊట్కూర్,(కృష్ణ) సెప్టెంబర్ 29 : ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, భీమా నదుల నుంచి ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. భారీ వరద ప్రవాహంతో కృష్ణ, భీమా నదీ పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో వరి పంటలు పూర్తిగా నీట మునిగాయి.
మరో పక్క నదీ పరివాహక ప్రాంతంలో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటర్లు సైతం నీట మునగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. కృష్ణ మండలం టైరోడ్డు సమీపంలోని వాసునగర్ లోతట్టు గ్రామంలోకి వరద నీరు చేరింది. దాదాపు 50 కుటుంబాలకు చెందిన 150 మందితో అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించారు.