ఊటూర్ (కృష్ణ), ఏప్రిల్ 5 : భీమానది తమకు కొండంత ధీమా అనుకున్న రైతులకు కన్నీళ్లే మిగిలాయి. యాసంగి లో కోటి ఆశలతో సాగు చేయగా, చి‘వరి’కి నిరాశే మిగిలింది. కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల చేయకపోవడంతో పంటలు చేతికిరాక అన్నదాతలు ఆగమవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 సంవత్సరంలో భీమానది ద్వారా సాగునీరు అందించేందుకు కృష్ణ మండలం తంగడి గ్రామం వద్ద లి ఫ్ట్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ ద్వారా కృష్ణ మండలంలోని సుకూ ర్ లింగంపల్లి, అయినాపూర్, కుసుమూ ర్తి, తంగడి గ్రామాల శివారు రైతులకు దాదాపు 1,000 ఎకరాలకు సాగునీరందించేవారు. కొన్నాళ్ల కిందట కర్ణాటకలో ఎగువన ఉన్న గూడూరు వద్ద బ్రిడ్జి కం బ్యారేజీని నిర్మించడంతో తెలంగాణ రై తులకు కండగండ్లే మిగిలాయి.
ఈ ఏ డాది భీమానది కింద యాసంగి సాగు చేపట్టిన రైతులు పొట్ట దశలోనే సా గునీటి ఇబ్బందులతోపాటు కరెంటు క ష్టా లు తోడవడంతో దిగుడుబడులపై పూ ర్తిగా ఆశలు వదులుకోవాల్సి వస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త సాగునీటి వనరులపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో నదీ పరివాహక ప్రాంతాలతోపాటు లిఫ్ట్ కింద దాదాపు 5వేల ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. సీ జన్ ప్రారంభంలో వరి నాట్లకు సరిపడా సాగునీరు నదిలో ఉండగా, సంక్రాంతి తర్వాత ఎగువ నుంచి రావాల్సిన సాగునీటిని కర్ణాటక అధికారులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో పంటలు పొట్ట, పాలు పోస్తున్న దశలోనే ఎండిముఖం పట్టా యి.
గూడూరు బ్యారేజీ దిగువ నుంచి కృష్ణ, భీమా సంగమం వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర గూడూరు బ్యారేజీ షెటర్ల లీకేజీ ద్వారా పా రుతున్న నీటిని రైతులు ఒడిసి పడుతున్నారు. పంటలను కా పాడుకునేందుకు నదిలో జేసీబీ ల సహాయంతో కాల్వ లు తీసి విద్యుత్ పంపు సెట్లను ఏర్పా టు చేశారు. కండ్లముందు పంట లు ఎండిపోతుండడంతో నీటి తడిని అందించేందుకు రైతులు కంటిమీద కు నుకు లేకుండా భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మరో పక ఎండలు తీవ్రతరం అవుతుండడంతో నదిలో ఉన్న కొద్దిపా టి నీళ్లు కూడా ఇంకిపోయి భీమానది ఎ డారిని తలపిస్తున్నది. నీటి విడుదలకు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై రైతు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాట క నుంచి విడుదల చేయించాలని ఎమ్మె ల్యే శ్రీహరి దృ ష్టికి తీసుకెళ్లినా స్పందన లేదంటున్నారు.
భీమానది కింద 40ఎకరాల్లో వరి సాగు చేశా. ఎగువన ఉన్న గూడూరు బ్యారేజీ నుంచి రెండు నెలలుగా నీటిని విడుదల చేయలేదు. సకాలంలో నీరందక 90శాతం పంట గింజ గట్టిపడక తాలుగా మా రింది. ఎకరాకు రూ.45వేల వరకు పెట్టుబడి పెట్టాం. నీళ్లు ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలే. నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించి పరిహారం చెల్లించాలి. కృష్ణ, భీమా సంగమం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడితే సాగునీటి ఇబ్బందులు ఉండవు.
– కావలి హనుమంతరాయ, తంగడి కృష్ణ మండలం
భీమానది పూర్తిగా వట్టిపోవడంతో లిఫ్ట్‌కు నీళ్లందక మోటర్లు పని చేయడం లేదు. 10రోజుల నుంచి లిఫ్ట్ బంద్ కావడంతో పంటలకు నీళ్లు లేక ఎండిపోతుంన్నాయి. పంట చేతికి రావాలంటే ఇంకా నెల రోజులు పడుతుంది. ఎగువ నుంచి నీటిని విడుదల చేయిస్తే తప్పా ఇంకో మార్గం లేదు. లేకపోతే పంటను పశువులకు మేతగా వదులుకోవాల్సిందే.
– గంగప్ప, రైతు, కుసుమూర్తి గ్రామం, కృష్ణ మండలం