julapally forest | మహమ్మాదాబాద్ మార్చి 16 : అటవీ అధికారులకు ఒక న్యాయం రైతులకు మరో న్యాయమా అని సీపీఎం పార్టీ జిల్లా నాయకులు రాములు, నర్సిములు అన్నారు. ఇవాళ మధ్యాహ్నం జూలపల్లి అడవి నాశనం చేసిన అంశం గురించి సీపీఎం జిల్లా బృందం అడవిని సందర్శించి పరిశీలించారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడవల్సిన అధికారులే అడవిని అమ్ముకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సొంత లాభంకోసం అడవిని ఆనవాళ్లు లేకుండా పెట్రోల్ పోసి అంటబెట్టడం దుర్మార్గం అన్నారు.
ఇదే అడవిలో మేకల కాపరి మేకలు చెట్లు మేసినవి అని మేకలను పట్టుకుపోయి దండగ (జరిమానా)లు వసూలు చేసే సెక్షన్ అధికారి అడివిని అమ్ముకుంటే పైఅధికారులు నేటికి స్పందించకపోవడం వెనకాల ఏదో పెద్ద కారణం ఉందని అన్నారు. వెంటనే ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లాకార్యదర్శి ఏ. రాములు, సీపీఎం రాష్ట్ర నాయకులు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి.నర్సిములు, వై. లక్ష్మయ్య, సీపీఎం జూలపల్లి గ్రామ కార్యదర్శి బి.రాజు సీపీఎం నాయకులు జంబుల బాల్ రెడ్డి, జె. అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు