అచ్చంపేటరూరల్: సీపీఐ( CPI ) అచ్చంపేట నియోజకవర్గం 18వ మహాసభలను ( Mahasabha ) విజయవంతం చేయాలని సీపీఐ అచ్చంపేట నియోజకవర్గ కన్వీనర్ పెరుముల గోపాల్( Gopal ) పిలుపునిచ్చారు. మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభల్లో సీపీఐ చేపట్టిన కార్యక్రమాల సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ పోరాటాల కార్యచరణ ప్రణాళిక రూపకల్పన చేస్తారని అన్నారు.
సభకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ నరసింహ, రాష్ట్ర నాయకులు కేశవులు గౌడ్, రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు హాజరవుతారని వివరించారు. తెలంగాణ భవనంలో శనివారం జరిగే మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ మల్లేష్, మహిళా నాయకురాలు ఎన్ తిరుపతమ్మ, ఎండి బషీర్, తదితరులు పాల్గొన్నారు.