గద్వాల, నవంబర్ 4 : బీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్తకూ గులాబీ జెండా అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గద్వాల మండలం పుటాన్పల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు సుదర్శన్‌రెడ్డి, రత్నంరెడ్డి, కోటేశ్రెడ్డి, నరసింహులు, బీసన్న, వెంకటేశ్, భాస్కర్‌రెడ్డి, అశోక్, శ్రీనుతోపాటు 80మంది, గట్టు మండలం ఇందువాసికి చెందిన అలీ, ఆంజనేయులు, వీరేశ్, నర్సింహులు, గూడు హనుమయ్య, శ్యాంకుమార్, జవహర్‌తోపాటు 50మంది, చిన్నోనిపల్లికి చెంది హనుమంతురెడ్డి, ముద్దిరెడ్డి, నారాయణరెడ్డి, శంకర్‌రెడ్డితోపాటు 20మంది, కౌన్సిలర్ నరహరిగౌడ్ ఆధ్వర్యంలో గద్వాల మున్సిపాలిటీలోని 18, 30వ వార్డుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రంగన్న, నరేందర్, ఈశ్వర్, శివ, కార్తీక్, బాషా, లక్ష్మణ్, ఆకాశ్, శశిగౌడ్, నరేశ్, శ్రావణ్‌తోపాటు 60మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడి పోయాయని, స్వరాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయన్నారు. నియోజకరవ్గంలో కొందరు కుల రాజకీయాలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతర అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కొందరు పగటి వేషగాళ్ల రూపంలో ఓట్లు అడగడానికి వస్తుంటారని, ఆ తర్వాత వారు ముఖం చాటేస్తారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామన్‌గౌడ్, నాయకులు సలాం, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, సంజీవులు, ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.