మహబూబ్‌నగర్, మార్చి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దోమలపెంట ఎస్ఎల్బీసీ ట న్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చే స్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. దాదాపు 12 రెస్క్యూ బృం దాలు నిర్విరామంగా షిఫ్టుల వారీగా పనిచేస్తున్నా పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో నిమిషానికి 10వేల లీట ర్ల నీరు ఉబికి వస్తుంది. గ్రౌటింగ్ చే సిన చోట కూలిపోవడంతోపాటు.. మట్టి పెళ్లలు కూలిపోయాయి. సొరంగం కుప్పకూలడంతో టీ బీఎం మిషన్ రెండు ముక్కలై ఒక భాగం సొరంగానికి అ డ్డంగా పడి ఉంది.
మరొకటి పడి ఉన్న చోట కార్మికులు చిక్కుకున్నారు. ఇ క్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయ ని సహాయక చర్య లు చేపట్టిన రె స్క్యూ బృందా లు పేర్కొంటున్నాయి. పేరుకుపోయిన బు రద.. ఉబికి వస్తున్న నీరు ఆటంకంగా మారాయి. అడ్డంగా పడి ఉన్న టీబీఎం మిషన్‌ను దాటి బురదను వెలికితీయడం అసాధ్యంగా మారింది. మరోవైపు బురదను తొలగించేందుకు కన్వేయర్ బె ల్ట్ రిపేరు ఎందుకు చేయలేదో? ఇప్పటికీ అ ర్థం కాని ప్రశ్నగా మారింది.
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట ప్ర మాద ఘటనలో చిక్కుకున్న వారి జాడ కనిపించే అవకాశాలు సన్నగిల్లాయి. ఆక్సిజన్ అం తంత మాత్రంగానే ఉన్న సొరంగంలో ప్రాణాలకు తెగించి రెస్క్యూ బృందాలు నిర్విరామం గా కృషి చేస్తున్నా ఫలితం కనిపించలేదు. ఎ లాగైనా చిక్కుకున్న వారిని బయటకు తీయాలని ప్రతికూల పరిస్థితుల్లో పని చేస్తున్నా దారి కనిపించడం లేదు.
నేషనల్ జియోగ్రాఫిక్ రీసె ర్చ్ ఏజెన్సీ చేపట్టిన జీపీఆర్ స్కానింగ్ రెస్క్యూ బృందంలో ఆశలు రేపిన అది కూడా విఫలం కావడంతో రెస్క్యూ మిషన్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నాయి. మరోవైపు సొరం గ ప్రమాదంలో కార్మికులు చిక్కుకున్న ప్రదే శం పూర్తిగా భిన్నంగా ఉండడంతో ఇక రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి రోబోలను రం గంలో దించాలని సీఎం రేవంత్ సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సా క్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం మీడియా కు వివరించారు. ఫలితంగా రెస్క్యూ మిషన్ మరింత ఆలస్యమయ్యే అవకాశమున్నది.
దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుని మరణించిన కూలీల వెలికితీతపై ఆశలు సన్నగిల్లాయి. సొరంగం ప్రమాదం జరిగి తొమ్మిది రోజులు గడుస్తున్నా సహాయక చర్యల్లో పురోగతి కనిపించక పోవడంతో అధికారులు నిరాశకు గురవుతున్నారు. దేశంలో ఉన్న అత్యుత్తమ బృందాలను ఇక్కడికి పిలిపించి నిర్విరామంగా కృషి చేస్తున్నా ఫలితం కనిపించలేదు. లోపల ప్రతికూల పరిస్థితులు ఉండడంతో ఒక అడుగు ముందుకు మూడు అడుగులు వెనక్కి అనేలా రెస్క్యూ బృందాలకు పెద్ద సవాల్‌గా మారింది.
ఎన్డీఆర్ఐ స్పాట్ చేసినా
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికు ల జాడలు తెలుసుకునేందుకు ప్రభుత్వం నేషనల్ జియోగ్రాఫిక్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ స హాయం తీసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బృందం సొరంగంలోకి వెళ్లి కార్మికులు చిక్కుకున్నారు అని భావిస్తున్న ప్రదేశాన్ని మొత్తం జీపీఆర్ ద్వారా స్కానింగ్ చేసింది. దీన్ని విశ్లేషించిన ఎన్డీఆర్ఐ ఐదు స్పాట్లను గుర్తించిం ది. ఈ స్పాట్లలో కార్మికులు చిక్కుకొని ఉంటారని గుర్తించింది. దీంతో ఆశలు చిగురించా యి. స్పాట్ అవుట్ చేసిన ప్రదేశాల్లో గత రెం డు రోజులుగా తవ్వకాలు చేపట్టారు. సహాయ క చర్యలు పర్యవేక్షించే బృందాలు ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్లి పనులు చేస్తున్నా ఫలితం కనిపించలేదు. ఈ స్పాట్ అవుట్లను టీబీఎం మిషన్‌కు సంబంధించిన విడిభాగాలు బయటకు వచ్చాయి. ఎంతో రిస్క్ తీసుకుని తవ్వి నా ఫలితం కనిపించలేదు.
టన్నెల్లో తొమ్మిది రోజులుగా సాగుతున్న సహాయక చర్యలో పురోగతి లేకపోవడంతో కొనసాగిస్తారా? లేదా ఆపేస్తారా? అనే సం శయం నెలకొంది. సీఎం రేవంత్ వచ్చి మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని ప్రకటించడం.. మానవ మాత్రులు ఎవరూ పనిచేయలేరని రోబోలను రంగంలో దించాలని ని ర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇంకోవై పు దేవాదులలో ప్రమాదం జరిగి తొమ్మిది మంది చనిపోతే ఐదేైళ్లెనా ఆచూకీ లభించలేద ని సీఎం చెప్పడం రెస్క్యూ ఆపరేషన్ ఇక ము ందుకా.. వెనక్కా.. అనే అనుమానం రేకెత్తిస్తున్నది. తమ వారి జాడ కోసం బంధువులు పడిగాపులు కాస్తున్న.. వారి పరిస్థితి దయనీయంగా మారింది. మొత్తంమీద సహాయక చ ర్యలపై డైలమా నెలకొన్నది.