పెద్దమందడి, మార్చి 26 : పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీ వ్రమైన వ్యతిరేకత మొదలైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయ్యకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై విసు గు చెందారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు, అన్నివర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశారని, అందుకే ప్రజలు ఏడాది తిరగకముందే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక త చూపుతూ మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు స్పష్టంగా కోరుకుంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుపు తధ్యమని అన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో గొల్ల ఈదన్న, మల్లేశ్, బాలరాజు, రవి, సాయికుమార్, చెన్నయ్య, వెంకటేశ్, కృష్ణయ్య, పరమేశ్, భీముడు, ఆంజనేయులు, సైదులు, పర్వతాలు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సేనాపతి, ఉపాధ్యక్షుడు జంగం రమేశ్, నాయకులు సింగిరెడ్డి కురుమూర్తి, రాములు, మొగులయ్య, పురుషోత్తంరెడ్డి తదితరులు ఉన్నారు.