అమరచింత, జూన్ 6 : పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకొని గాయాలపాలు కాగా ఇరువురు అమరచింత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ కాలనీకి చెందిన అరుణ్‌కుమార్, రవితేజలు బుధవారం రాత్రి గొడవపడవగా ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే అరుణ్‌కుమార్ మెడలోని బంగారు చైన్ కనిపించకపోవడంతో రవితేజపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
అయితే రవితేజ కడుపు భాగంలో గాయం కాగా ఎస్సై గాయానికి కారుకుడైన అరుణ్‌కుమార్‌ను వదిలిపెట్టి గాయపడిన వ్యక్తినే రెండు రోజులుగా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ పేరుతో వేధిస్తున్నారని విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి శుక్రవారం సాయం త్రం అమరచింత పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఎస్సై సురేశ్‌ను నిలదీసి రవితేజను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అరుణ్‌కుమార్ రవితేజపై దాడి చేసి గాయపర్చిన ఎస్సై సురేశ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తు గాయపడిన వ్యక్తిపైనే కేసు నమోదు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.