మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 27 : రైతుబంధును నిలిపి అన్నదాత కడుపుపై కొట్టిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 34వ వార్డు మార్కెట్‌యార్డు సమీపంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత వ్యవసాయం రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేశారన్నారు. రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్, ప్రాజెక్టులు నిర్మాణ కోసం కృషి చేశారని గుర్తుచేశారు. డిసెంబర్ 3 తరువాత పెరిగిన రైతుబంధు రైతుల ఖాతాలో వేస్తామని మంత్రి భరోసానిచ్చారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే అన్ని సంక్షేమా పథకలు తీసేస్తారు, 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తారు. మహబూబ్‌నగర్‌లో ప్రతి వార్డును అభివృద్ధి చేశామని, భవిష్యత్తు మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ను అన్ని విధాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ప్రజలంతా సహకరించి ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ తాటిగణేశ్, కౌన్సిలర్లు కోట్ల నర్సింహ, గోవిందు, సాయిలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 27 : మీ ఒకడిలా కార్మికుడినై పనిచేసుకుంటు వస్తున్నానని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని హ్యూండయ్, మారుతి సుజుకీతోపాటు పలు ఆటో మోబైల్స్ షోరూంలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో, కార్మికులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అప్యాయంగా సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ జయరామ మారుతి షోరూంలో కేవలం నెలకు 50 కార్లు అమ్ముడు పోయేవని, నేడు ప్రతి నెలకూ 300 వరకు విక్రయం జరుగుతుందని తెలిపారు. 2014 తరువాత ఎంతో వేగంగా మహబూబ్‌నగర్ అభివృద్ధి జరిగిందని తెలియజేశారు. కారుకు గుర్తుకు ఓటు వేసి మన అందరం మద్దతు ప్రకటిద్దామని సూచించారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛంను బెక్కరి రాంరెడ్డి అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు ఎరుకుల సంఘం నేతలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించా రు. మంత్రి గెలుపునకు పూర్తిస్థాయిలో సహయ సహకారాలు అందిస్తామని సంఘం నేతలు పోచయ విశ్వనాథ, శేఖర్, రాజశేఖర్, బబ్లూ, శివ, అచ్యుత్, స్వా మి, రాంచంద్రయ్య, సిలుమూర్తు కృష్ణయ్య తెలిపారు.
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 27 : మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పదేండ్లుల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అకర్షితులై కాంగ్రెస్, బీజెపీ పార్టీల నుంచి అధికార బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 24వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు హామెద్ షేక్, నూరుల్లా, అబిద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్రహీం, ఖాజా ఖాన్, బాబా, మథిన్, నయీం, అంజాద్ సహా సుమారు 25 మంది, సత్యమన్న కాలనీకి చెందిన కాంగ్రెస్, బీజెపీ నాయకులు 25 మంది మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.