మాగనూర్, నవంబర్ 14 : నర్సరీల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. వనమహోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సరీల్లో మొక్కలు పెం చేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. అవన్నీ పచ్చగడ్డి పాలవుతున్నాయి. మండలంలోని భైరంపల్లి, పర్మన్దొ డ్డి గ్రామాల నర్సరీలో మొక్కలను పెంచడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
దీంతో పర్మన్దొడ్డి పల్లెప్రకృతి వనంలో దాదాపు వందల మొక్కలు వృథాగా.. ఇష్టానుసారం వేశారు. కొ న్ని మొక్కలు నీళ్లులేక ఎండిపోతుంటే.. మరికొన్నింటి ని మేకలు, పశువులకు మేపుతున్నారు. బైరంపల్లి నర్స రీ నిర్వహణ లేకపోవడంతో పచ్చగడ్డి మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.