దామరగిద్ద, అక్టోబర్ 29 : పదేండ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాంహౌస్‌లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాబోయే 30 రోజులు కష్టపడి పనిచేసి అభివృద్ధిని ప్రతిఒక్కరికీ వివరించాలన్నారు. చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ తిరిగి తెలపాలని కోరారు. అనంతరం ధన్వాడ మండలం కాంగ్రెస్ పార్టీకి చెందని 40 మంది యువకులు ఎమ్యెల్యే రాజేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ భీమయ్యగౌడ్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు ఈదప్ప, వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ భీంరెడ్డి, నాయకులు చంద్రకాంత్, పటేల్ బసంత్‌రాజ్ పాల్గొన్నారు.