మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రెండు నెలల కిందట సర్వేనెంబర్ 525లోని ఆదర్శనగర్‌లో దివ్యాంగుల ఇండ్లను పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా కూల్చివేయడంతో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు బీఆర్ఎస్ నేత లు ఆందోళనకు దిగారు. దివ్యాంగులకు అండగా ఉండి వారి కి ఆశ్రయం కల్పించి అన్నం పెట్టారు. ఈ పాపానికి బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు. 2018లో ఇదే సర్వేనెంబర్లలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో సహా కేసులు పెట్టగా, వాటిని తిరగదోడి తాజాగా బీఆర్ఎస్ నేతలపై కేసు లు నమోదు చేశారు.
ఈ కేసులో మాజీ మంత్రి తమ్ముడు శ్రీకాంత్‌గౌడ్‌ను అన్యాయంగా ఇరికించి జైలుకు పంపారు. ఇదంతా కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే వన్‌టౌన్ పోలీసులు సదరు కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి చితకబాది తర్వాత రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేశారు.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బాధితులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించి నిలదీశారు. దీంతో పోలీసులు తమదే తప్పని అంగీకరించిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి హడావిడిగా మాజీ మంత్రితోపాటు 19మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో ఈ కేసుల పరంపర చర్చనీయాంశగా మారింది. అన్యాయంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చెప్పిందే వేదంగా మారింది. పోలీసు వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని ఆటాడిస్తున్నారు. తాము చె ప్పిందే వేదం అంటూ హుకూం జారీ చేశారు. ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. తన మాట పోలీసులు వినడం లేదని రాజకీయ ఆధిపత్యం కోసం ఏకంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంగ్రెస్‌లో ఇరువర్గాల అలజడి మొదలైంది. ఈలోపు ఓ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో దొంగతనం, ఆ తర్వాత అనుమానస్పద స్థితిలో బాలిక చనిపోవడంపై పోలీసు యంత్రాంగం గద్వాలలో కాదని మల్దకల్లో కేసు పెట్టడం చకచకా జరిగిపోయాయి.
అభం, శుభం తెలియని బాలిక మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా అలంపూర్ నియోజకవర్గంలో ఏకంగా తాసీల్దార్‌పై కాంగ్రెస్ నేతలు దా డికి దిగారు. తనపై దురుసుగా ప్రవర్తించారని పోలీసు కేసు పెడితే ఎస్సై స్పందించకపోవడం, స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో రెవెన్యూ అసోసియేషన్‌ను సంప్రదించాల్సి వచ్చింది. ఈ జిల్లాలో ఏకంగా పోలీసు వ్యవస్థ మొ త్తం కాంగ్రెస్ చెప్పుచేతుల్లో ఉందనడానికి ఇదే సాక్ష్యమని ఉద్యోగ సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీసులు చిన్న, చిన్న కేసుల్లో తీసుకొచ్చి లాఠీలు ఝులిపిస్తున్నారు. ఇటీవల లింగాలలో ఓ పెట్రోల్ బంక్‌లో జరిగిన చిన్న గొడవకు కారణమైన ము గ్గురు యువకులను స్టేషన్‌కు పిలిపించి గుండ్లు కొట్టించి అవమానించారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడితే విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనకు కారకుడైన పోలీసులపై బదిలీ వేటు వేసి చేతులు దులుపుకొన్నారు. ఎన్నికలైన కొన్ని రోజుల్లోనే సొంత నియోజకవర్గానికి వెళ్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజును కల్వకుర్తి వద్ద అడ్డుకొని నానా హంగామా సృష్టించారు.
ఇదంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేల డైరెక్షన్లోనే జరిగింది. మిగతా చోటామోటా నాయకుల తీరుపై ఇక చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. మాట వినని వారిని తమ దా రికి తెచ్చుకుంటున్నారు. అన్యాయం జరిగిందని పోలీసు ఉ న్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే క రువయ్యారు. ఖాకీలు ఖద్దర్ డ్రెస్సులు వేసుకొని రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఘటనపై దృష్టి సారించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మహబూబ్‌నగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉ మ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసుల నిర్బంధ కాండ యథేచ్ఛగా కొనసాగుతోంది. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ధర్నాలు, ఆందోళనలు చేసినా కేసులు పెట్టి బీఆర్ఎస్ నేతలను బెదిరింపులకు గురిచేస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ లో దివ్యాంగుల ఇండ్లను ఎందుకు కూల్చారని ప్రశ్నిస్తే మాజీ మంత్రి తమ్ముడిపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారు.
సోషల్ మీడియాలో ఒక కార్యకర్త పోస్టు పెట్టడంతో అతడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చి తకబాది బైండోవర్ చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన మాజీ మంత్రి శ్రీ నివాస్గౌడ్తోపాటు 19మందిపై కేసులు పెట్టారు. ఇక సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అంతా కాంగ్రెస్ నేతలదే హవా నడుస్తోంది. నారాయణపేట జిల్లాలో సీఎం నియోజకవర్గానికి వచ్చే మం డలాల్లో ఏ చిన్న ఆందోళన జరిగినా బొక్కలో పడేస్తున్నారు. రాత్రికి రాత్రి అరెస్టులు.. అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లోని ఓ వైన్స్‌లో జరిగిన గొడవ కారణం గా యువకుడి ప్రాణాలు పోయాయి.
ఈ కేసులో ఓ ఎమ్మెల్యే బంధువు ఉండడంతో ఇంతవరకు అతడిని అరెస్టు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగిని కా పాడి స్టేషన్ గడప ఎక్కకుండానే చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఎమ్మెల్యే హోదాలో నీళ్లు వదిలితే పోలీసులు హడావుడి చేసి ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించారు. కో స్గిలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని రైతు లు తెగేసి చెబితే వారిని కలిసి మద్దతు ఇచ్చిన పాపానికి ఓ మాజీ మంత్రితో సహా మాజీ ఎమ్మెల్యేలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్టేషన్లలో తిప్పి తర్వాత వదిలిపెట్టారు. పది నెలల కాలంలో పోలీసు వ్యవస్థ అంతా అధికార పార్టీ చెప్పు చేతుల్లోకి వెళ్లిందనే విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్బంధకాండ కొనసాగుతున్నది.