పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 16 : మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభానికి బీఆర్ఎస్ సర్పంచులను పిలిచి అవమానించిన ఘటన పెద్దకొత్తపల్ల్లిలో చోటుచేసుకున్నది. దీంతో సర్పంచులు అధికారుల తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ డీఆర్డీవో రాజేశ్వరికి రాత పూర్వకంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
బీఆర్ఎస్ సర్పంచులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు పెద్దకొత్తపల్లి మండల కేంద్ర సర్పంచ్ బెట్టరి రేణుకతో పాటు మరి కొంత మందికి సింగిల్ విండో కార్యాలయం నుంచి ఆహ్వానం అందించారు. తీరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం సమయం కంటే ముందుగానే పెద్దకొత్తపల్లి సర్పంచ్ బెట్టరి రేణుక, కల్వకోలు గ్రామ సర్పంచ్ బంట్రోత్ శ్రీనివాస్, సాతాపూర్ గ్రామ సర్పంచ్ కట్టా వంశీగౌడ్, ఆదిరాల సర్పంచ్ కర్ణాకర్ రెడ్డిలు వస్తున్నారు అనే విషయం తెలుసుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ దండు నరసింహ చేత ప్రారంభిం చినట్లు తెలిపారు.
మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అధికారులు, అధికార పార్టీ నాయకుల సూచనలతో ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి ఇలాకలో ప్రజల మద్దతుతో గెలిచిన సర్పం చులకు నిత్యం అవమానం జరుగుతున్నా సదరు మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారు ల తీరు మార్చుకోవాలని లేని యేడల సర్పంచుల ఆత్మగౌరవం కోసం ఆందోళన బాట పడుతామని హెచ్చరించారు.