బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దౌర్జన్యం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అంటే ఎం తో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. కా నీ.. ఇక్కడ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నా యకులు ఫ్యాక్షన్ రాజకీయాల వైపు అడుగు లు వేస్తున్నారు.
- ఇద్దరికి గాయాలు
- సీఎం ఇలాకాలో రెచ్చిపోతున్న హస్తం పార్టీ నాయకులు
- ప్రజాస్వామ్యం మరిచి ఫ్యాక్షన్ వైపు అడుగులు
కోస్గి, ఫిబ్రవరి 20 : సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అంటే ఎం తో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. కా నీ.. ఇక్కడ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నా యకులు ఫ్యాక్షన్ రాజకీయాల వైపు అడుగు లు వేస్తున్నారు. బెదిరింపులు, దాడులకు పా ల్పడి ఎన్నికల్లో గెలిచినా దానితో సంతృప్తి చెం దని కొందరు నాయకులు పైశాచికంగా ప్రవర్తిస్తూ ప్రతిక్ష నాయకులపై దాడుకుల తెగబడుతున్నారు. సీఎం సైతం అభివృద్ధి మరిచి ప్రతిపక్ష నాయకులపై దాడులను ప్రోత్సహిస్తున్నారు.
మొన్న సర్జఖాన్‌పేట గ్రామంలో స ర్పంచ్ అభ్యర్థులపై దాడి, నిన్న పోతిరెడ్డిపల్లి లో బీఆర్ఎస్ మహిళ అభ్యర్థిపై దాడి, నేడు కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి. ఇలా నియోజకవర్గంలో రోజుకో నాయకుడిపై దాడి చేస్తూ పై శాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ క్ర మంలోనే గురువారం అర్ధరాత్రి మాసాయిపల్లిలో బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కార్యకర్తలు జి వెంకటయ్య, బోడ వెంకటయ్యలు తమ వార్డులో బయట కూర్చొని మాట్లాడుకుంటుండగా అటుగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్త ఎల్ల ప్ప వారితో అకారణంగా వాగ్వాదానికి దిగా డు.
మీరెందుకు బీఆర్ఎస్కు మద్దతు తె లుపుతున్నారంటూ వారితో గొడవకు దిగారు. అ క్కడున్న వారు వారిస్తున్న వినకుండా మ ద్యం మత్తులో వారిపై రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరి తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఇది మా కాం గ్రెస్ అడ్డా.. ఇక్కడ ఇతర పార్టీలు ఉండకూదంటూ దుర్భాషాలాడుతూ.. నన్నెవరూ ఏమీ చెయలేరంటూ దాడి చేసి వెళ్లిపోయాడు. స్థానికుల సహాయంతో వారిని దవాఖానకు తరలించి చికిత్సలు అందించారు. అనంతరం బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దాడి అమానుషం
తమ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్త చేసిన దాడి అమానుష చర్య అంటూ ఐదో వార్డు బీఆర్ఎస్ నేత ఉసేనప్ప గౌడ్ మండిపడ్డారు. అధికార బలంతో ప్రతిపక్షాన్ని అడ్డుకోవాలనుకోవడం పిరికిపందల చర్య అన్నారు. బీఆర్ఎస్ మండల నాయకులు వెంకట్‌నర్సిములు మాట్లాడుతూ అమలుకాని హామీలతో అదికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చె య్యలేక హామీల అమలుపై ఎక్కడ ప్రశ్నిస్తార నే దాడులకు దిగుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నా ఇలాంటి నీచరాజకీయాలకు ఎప్పుడూ పాల్పడలేదన్నా రు. అధికారం ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కా దని కాంగ్రెస్ మర్చిపోవద్దని, దాడు లు కొనసాగిస్తే తాము చూస్తు ఊరుకోమన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

