ఊట్కూర్, మార్చి 6: మండలంలోని తిప్రాస్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సుమంగళి కుటుంబంపై కాంగ్రెస్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. స్థానికులు, బాధి త కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం& మాజీ సర్పంచ్ సు మంగళి భర్త నారాయణ మెయిన్ రోడ్డు పక్కన ఉన్న తన తమ్ముడు వెంకటేశ్ ఇంటి ముందు కూర్చుని మాట్లాడుతుండగా శుక్రవారం సా యంత్రం 4 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ విజయలక్ష్మి భర్త నర్సింహ, అతని అనుచరులు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.
కాంగ్రెస్ వర్గీయుల దాడి లో నారాయణ తలకు, చేతులకు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమి త్తం కుటుంబ సభ్యులు నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించారు. ఈ సంఘటనలో మాజీ సర్పంచ్ తోడి కోడలు శారద సైతం గాయపడింది. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, రైతు బంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శివరాజ్‌రెడ్డి, తిప్రాస్‌పల్లి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కావలి సురేశ్ దవాఖానకు వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు.
నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్ మండలం తిప్రాస్‌పల్లి గ్రామకంఠం శివారులోని సర్వే నంబర్ 53ను కబ్జా చేసేందుకు కాంగ్రెస్ వర్గీయులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్నందునే తమపై సర్పంచ్ వర్గీయులు దాడులకు పాల్పడినట్లు మాజీ సర్పంచ్ వర్గం ఆరోపిస్తోంది. సర్వే నంబర్లో గతంలో గ్రామస్తులు ఇండ్లు నిర్మించుకోగా మిగులు భూమిని ఆక్రమించుకునేందుకు మూడు నెలలుగా సర్పంచ్ వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారనే అక్కసుతో మాజీ సర్పంచ్ భర్త, కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.