మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 25 : మహబూబ్‌నగర్‌లో శనివారం ఎరువుల కోసం వచ్చి.. ఫిట్స్ వచ్చి పడిపోయిన ఆంజనేయులు అసలు రైతే కాదని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందని బీఆర్ఎస్ నాయకులు పాలమూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేశ్, సీనియర్ నేత ఇమ్రాన్ అన్నారు. ప్రజలదృష్టి మళ్లీంచెందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కబ్జాలు, దౌర్జన్యాలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు పదేపదే మాట్లాడటం సరికాదన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉందికదా.. ఎవరు అక్రమాలకు పలుపడ్డారో నిరుపించాలన్నారు. వంద ఓట్లు వేయించలేని నాయకులు మాజీ మంత్రి వెంట తిరుగుతున్నారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరిసత్తా ఎంటో తెలుస్తుందన్నారు. ఎరువుల పంపిణీ కేంద్రం వద్ద మూర్చ వచ్చి పడిపోయిన ఆంజనేయులు రైతు కాదం టూ, ఆయనకు భూమేలేదంటు మాట్లాడుతున్నా కాం గ్రెస్ నాయకులు ఒక్కసారి నవాబ్‌పేట్ మండలం కాకార్లపహాడ్లో అధికారులతో విచారణ చేపట్టాలన్నారు.
ఆంజనేయులుకు 26 గుంటలకుపైగా భూమి కలిగిన రైతు ఆయన యూరియా కోసమే వచ్చాడు కావాలంటే ఆయన పాస్‌బుక్ చూడండి అంటూ తనదగ్గరున్న పాస్ బుక్‌ను చూపించాడు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు ఇమ్రాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తమ అధిపత్యం కోసం ఒక్కొకరు ప్రెస్మీట్లు పెడుతున్నారు, బ్యానర్ల కోసం కొట్లాడుతున్నారే తప్పా రైతుల సమస్యలపై ఎక్కడా మాట్లాడటం లేదని విమర్శించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో ఎదిగిన నాయకులే ఈ రోజు ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నపుడు ఆయనపై ఖాజాపాషా మాట్లాడిన మాటలు ఆయన మరిచిపోయినట్టున్నారు. అవసరానికి రంగులు మార్చే ఖాజాపాషా నువ్వు ఎన్ని డబుల్బెడ్రూంలు, ఇందిరమ్మ ఇల్లు అమ్ముకొని కమీషన్ తీసుకున్నావో నీ చిట్టి మాదగ్గర ఉంది జాగ్రత బిడ్డ అంటూ హెచ్చరించారు. సమావేశంలో నవకాంత్, ఓబేద్, సుధాకర్, సిద్దిఖ్, అబిద్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.