అచ్చంపేట, సెప్టెంబర్ 19 : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి నదీ జలాలను సాధించుకోవాలని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ మంజూరు చేసి శంకుస్థాపన చేసిన అచ్చంపేట అప్పర్‌ప్లాట్ రిజర్వాయర్ నిర్మాణాన్ని ఎందుకు మరుగున పెట్టినవు, ఉమామహేశ్వరం, రాయలగండిచెన్నకేశవ, మద్దిమడుగు రిజర్వాయర్ నిర్మాణాలు ఎందుకు చేపట్టడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. అదే బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఏడాదిలోనే అచ్చంపేట రిజర్వాయర్ నిర్మా ణం ఫేజ్-1, ఫేజ్ -2 పూర్తి చేసి 75వేల ఎకరాలకు సా గునీరు ఇచ్చి రైతుల అచ్చంపేట రైతాంగం కళ్లలో ఆ నందం నింపేవారమని అన్నారు.
శుక్రవారం అచ్చంపేటలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జై పాల్‌యాదవ్, స్థానిక నేతలతో కలిసి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు అంతర్భాగమైన అచ్చంపేట సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి 2021లో కేసీఆర్ పరిపాలన అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించి, టెండ ర్లు పిలిచి 2023లో అప్పటి ఎమ్మెల్యే ప్రాజెక్టుకు శంకుస్థాప న చేశారన్నారు. పదే పదే నల్లమల బిడ్డచెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి కొండారెడ్డిపల్లి అచ్చంపేట ప్రాంతంలోనే ఉంది కదా మరి పనులు చేపట్టేందుకు రూ. 1534కోట్ల నిధులతో రెడీగా ఉన్న అచ్చంపేట రిజర్వాయర్‌ను రెండేైళెనా పనులు ఎందుకు మొదలు పెట్టడంలేదని ప్రశ్నించారు.
చంద్రసాగర్ రిజర్వాయర్ నుంచి అప్పర్‌ప్లాట్‌కు సాగునీరు ఎత్తిపోసేందుకు ప్రప ంచంలోనే ఎత్తైన లిఫ్ట్‌ను అచ్చంపేట రైతాంగం కోసం డిజైన్ చేయడం జరిగిందన్నారు. చివరిదశలో ఉన్న రంగారెడ్డి-ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి రూ. 1000-1200 కోట్లు నిధులు ఖర్చుచేసి ఉంటే ప్రాజెక్టు పూర్తై రెండు పంటలకు సాగునీరు అందేదన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోలేకపోతే భవిష్యత్‌లో చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కృష్ణానది ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని సముద్రమట్టానికి 519 ఎత్తులో ఉంటే ఆల్మట్టి డ్యామ్‌ను ఇవాళ 524 మీటర్ల ఎత్తుకు పెంచుతున్నారని దీని ఎత్తుపెంచడం ద్వారా కర్ణాటక రా ష్ట్రంలోనే లక్షా 50వేల ఎకరాల భూమిని సేకరించడంతో పాటు వందలాది గ్రామాలు ముంపునకు గురవుతున్నావి ఇది వాళ్ల బాధ.
నీటి కేటాయింపు ట్రిబ్యునల్ ఫైనల్ వాటా ఇచ్చే వరకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు నిర్మాణాన్ని నిరోధించాలి, కాంగ్రెస్ పార్టీ నిద్రలోంచి బయటకు రావాలి, అవసరమైతే అన్ని పక్షాలను కలుపుకోని ఉమ్మడి గొంతు వినిపించాలని అన్నారు. ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం తనగొంతు వినిపిస్తుందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నోరు విప్పాలన్నారు. కృష్ణానదికి వరదకు వచ్చినంక 45 రోజులైనా రైతులకు నీళ్లు ఇచ్చే సోయి సీఎం, మ ంత్రులకు లేదు, 45రోజుల పాటు నీళ్లు సముద్రంలోకి వెళ్లినంక రైతులు ఆందోళన చేసినంక నీళ్లు వదిలారు, బీఆర్ఎస్ హయంలో కృష్ణానదికి వచ్చిన వరద వచ్చినట్లే ఒడిసిపట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు నింపి రైతులకు పుష్కలంగా నీళ్లు అందించామని ఆయన గుర్తు చేశారు.
గత పదేండ్లలో దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా, నెంబర్‌వన్‌గా ఉన్నదని ఇవాళ యూరియా కోసం రాత్రి పగలు, చెప్పులు క్యూలో పెట్టి గొస తీస్తున్న రాష్ట్రం ఎక్కడుందంటే తెలంగాణ అని చెప్పుకునే దీనస్థితికి తెలంగాణకు తీసుకువచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేసీఆర్ కిట్, రైతులకు ఆర్థిక సాయం అందజేస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడుందంటే తెలంగాణలో అని చెప్పేవారని, పాడి పంటలతో కళకళలాడే పాలమూరు జిల్లాలో నేడు కరువు, వలసలు, ఆకలి చావులు ప్రారంభమయ్యాయని, విజయ్ డెయిరీ రైతులకు డబ్బులు ఇవ్వలేని పనికిమాలిన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు, ఉద్యోగులు, యువకులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు.
కేసీఆర్ పదేండ్లలో దేశంలోనే అన్ని విభాగాల్లో గర్వంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో దివాళ తీయించే స్థాయికి చివరికి తీసుకువచ్చారన్నారు. కేసీఆర్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు. చివరి దశలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీధులు ఇవ్వలేక పనులు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని, రైతాంగ సమస్యలపై పోరాటం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించేందుకు చర్చిస్తున్నామని అన్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని 14నియోజకవర్గాలకు సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరం కలిసి కాంగ్రెస్‌పై పోరు చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. కాళేశ్వరం రిజర్వాయర్ ఒక పిల్లర్ కడితే సరిపోయేదని దాన్ని రాజకీయం చేస్తూ కేసీఆర్‌ను బద్నాం చేస్తూ రైతులకు తీరని నష్టం చేస్తున్నారని అన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు తులసీరాం, నర్సింహాగౌడ్, కర్ణాకర్‌రావు, వెంకటయ్య, అమినోద్దీన్, చెన్నకేశవులు, కేటీ తిర్పతయ్య, కౌన్సిలర్లు రమేశ్‌రావు, కుత్భుద్దీన్, శివ, గోపాల్‌రెడ్డి, నరేందర్‌రావు అన్ని మండలాల నుంచి ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.