కొల్లాపూర్, డిసెంబర్ 26 : కరువు నేలలో బీఆర్ఎస్ ప్ర భుత్వం కృష్ణమ్మను పారిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాలమూరుకు పాతర వేస్తోందనే చర్చ ఉమ్మడి జిల్లాలో వినిపిస్తోన్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల గత కేసీఆర్ ప్రభుత్వంలో పురుడు పోసుకున్నది. 2015 సంవత్సరంలో పనులకు శ్రీకారం చుట్టగా.. 2023 సెప్టెంబర్ 16న నాటి సీఎం కేసీఆర్ స్వయంగా బాహుబలి (145 మోగావాట్స్ పంప్‌ను) మోటర్లను ఆన్ చేసి తెలంగాణ రైతాంగానికి ప్రాజెక్టును అంకితం చేశారు. నాటి నుంచి మోటార్ రోజుకు 3,200 క్యూసెక్కుల జలాలను లిఫ్ట్-1లోని నార్లాపూర్-అంజనగిరి రిజర్వాయర్‌లోకి 2 టీఎంసీలు ఎత్తిపోశాయి. తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రభు త్వం మారడంతో కృష్ణాజలాలు పాలమూరుకు రాకుండా రేవంత్ సర్కారు అడ్డుకట్ట వేసిందన్న చర్చ స్థానిక రైతుల నుంచి వినిపిస్తున్నది.
గత ప్రభుత్వ హయాంలో 3వ ప్యాకేజీలో 10 శాతం పనులు మాత్రమే మిగిలిపోయా యి. 15 లక్షల క్యూబిక్ మీటర్ల వర్క్స్ పూర్తి చేస్తే వట్టెం రిజర్వాయర్ వరకు దాదాపు 50 టీఎంసీల నీటిని తరలించి నిల్వ చేసుకునే అవకాశం ఉన్నదని నిపుణులు పే ర్కొన్నారు. అయితే సర్కారు రావడం.. పాలమూరు వాసి రేవంత్ సీఎం కావడంతో పీఆర్ఎల్ఐ పెండింగ్ ప నులు వేగంగా పూర్తవుతాయని అంతా భావించారు. ఇక కరువు నెల సస్యశ్యామలం కావడం ఖాయమని అనుకున్నారు. కానీ రైతులు ఒకటి తలిస్తే.. ప్రభుత్వం మాత్రం పనులను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభు త్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా తట్టెడు మట్టి తీయలేదు.. కదా కావాలనే నిర్లక్ష్యంతో ‘పాలమూరు’ పనులకు పాతర వేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకంలో మొదటి ప్యాకేజీలోని మోటర్లను రెండున్నరేండ్ల కిందట ప్రారంభించి కొద్దిరోజులు నీటిని ఎత్తిపోశారు. అప్పటికే మరో మోటర్ కూడా పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరో రెండు మోటర్లను కూడా అధికారులు క్షణం కూడా తీరిక లేకు ండా ఎత్తిపోతకు సిద్ధం చేశారు. తర్వాత రేవంత్ సర్కారు హయాంలో పక్కనున్న ఏపీ కృష్ణానీటిని తరలించుకుపోతుంటే చూడలేక తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వాలన్న తలంపుతో ఇరిగేషన్ అధికారులు రేయింబవళ్లు కష్టపడి మోటర్లను సిద్ధం చేశారు. కానీ అధికారులకు రైతులపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేకపోవడంతో పంపింగ్‌కు మోటర్లు సిద్ధంగా ఉన్నా.. తోడివేతను ప్రారంభించకపోవడంతో రైతుల పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అంతేకాదు మోటర్లు నిరంతరం రన్నింగ్‌లో లేకపోతే దె బ్బతినే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఏ పరికరమైన నిరంతరం వాడుకలో ఉంటే తప్పు పట్టేందుకు అవకాశం ఉండదు.. అలాంటిది 145 మెగావాట్స్ బాహుబలి మోటరుఉ్ల నిరంతర రన్నింగ్‌లో లేకుంటే పరిస్థితి ఏమిటన్నది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అలాంటి ప్రశ్నలే రైతులకు, జనాలకు ఉత్పన్నమవుతున్నాయి. మోటర్లను అ ప్పుడప్పుడు డ్రైరన్ లేదా వెటరన్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మోటర్ల మన్నిక పెరుగుతోందని అధి
కారుల సూచన. కానీ పాలమూరు ప్రాజెక్టులోని మొదటి పంప్‌హౌస్‌లో 4 మోట ర్లు సిద్ధంగా ఉన్నాయి. 2023లో ఒక మోటర్ ప్రారంభించి తర్వాత పంపింగ్‌ను నిలిపివేశారు. నేటి వరకు మోటర్లు రొటేషన్ లేకుండా ఉంచితే నష్టంతోపాటు భారీగా వ్యయప్రయాసాలతో మళ్లీ మరమ్మతులు చేపట్టాల్సి వచ్చే ప్రమాదం ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఒక బాహుబలి మోటర్ విలువ దాదాపు రూ.179 కోట్లు ఉంటుందని అంచనా. ఇలాంటివి ప్యాకేజీ-1లోని పంప్‌హౌస్‌లో 8 మోటర్లు ఉన్నాయి. ఇందులో నాలుగు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మోటర్లు రన్నింగ్ చేస్తున్నారా? అధికారులు రొటేషన్ చేస్తున్నారా? లేదా అనే విషయం ప్రశ్నగా మారింది. 30 నుంచి 60 రోజులకు ఒకసారైనా మోటర్ల కొద్దిగా తిప్పడం, వైండింగ్ హీటర్లను ఎల్లప్పుడూ ఆన్‌చేసి ఉం చాలి.. డ్రైరన్, రొటేషన్ లేకుండా.. వైండింగ్ హీటర్ల రక్షణ లేకుంటే మోట ర్లు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు.మోటర్లను రొటేషన్ చేయకుంటే.. వాటి బేరింగ్లు తుప్పు పట్టే అవకాశం ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధిని మరిచి రాజకీయం చేసేందుకు ప్రాధాన్యమిస్తుందన్న విషయం రాష్ట్రంలో జరుగతున్న పరిణామాలను చూసి తెలుసుకోవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం ప్రగతిని పరుగులు పెట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మోటర్లు పాడైతే ఆ నిందను బీఆర్ఎస్ మీద నెట్టేందుకు చూస్తుందని స్థానిక రైతులు మండిపడుతున్నారు. అదీ గాక పాలమూరు ప్రాజెక్టులోని మొదటి పంప్‌హౌస్‌లో4 నాలుగు మోటర్ల ఫంక్షనింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంప్‌హౌస్‌కు 400 కేవీ విద్యుత్ సరఫరా లేనట్లు తెలిసింది. మోటర్లను డ్రైరన్ చేయకుండా పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుందని ఇప్పటికే రిటైర్డ్ ఇంజినీర్లు సైతం హెచ్చరించారు. బీఆర్ఎస హయాంలో లిఫ్ట్-1 పరిధిలోని రిజర్వాయర్‌లోకి 2 టీఎంసీలు పంపింగ్ చేసి.. నీటిని నిల్వ చేశారు. కాంగ్రెస్ హయాంలో మోటర్లు సిద్ధంగా ఉన్నా కనీసం డ్రైరన్ కూడా చేయడం లేదన్న విమర్శలు లేకపోలేదు. మోటర్లలో ఏదైనా సమస్య తలెత్తితే అభియోగాన్ని నాటి కేసీఆర్ ప్రభుత్వంపై వేసేందుకు కుట్ర పన్నినట్లు గులాబీ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన 10 శాతం పనులను కూడా నేటి సర్కారు పూర్తి చేయలేదు. ఇది కూడా కుట్రలో భాగమే అని రైతులు అంటున్నారు.
పనులపై నిర్లక్ష్యమెందుకు? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తుందో అంతు ప ట్టడం లేదు. బీఆర్ఎస్ సర్కారు హ యాంలో కృష్ణా జలాలను మొదటి రి జర్వాయర్లోకి పంపింగ్ చేశాం. కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లయినా సిద్ధంగా ఉన్న మోటర్లకు డ్రైరన్.. లేదా వెటరన్ ఎందుకు నిర్వ హించడం లేదో రైతులకు సమాధానం చెప్పాలి. దక్షిణ తెలంగాణపై వివక్ష చూ పి మళ్లీ వలసల పయనం చేయించ వద్దు. సర్కారు నిర్లక్ష్యం వీడి పనులు చేసి సాగునీరు అందించాలి.