అమరచింత, జూన్ 26 : రాష్ర్టంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఏమా త్రం అవగాహన లేదని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి, అల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. గురువారం సాయంత్రం మండలంలోని జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వానకాలం సీజన్‌కు ముందే వర్షాలు కురిసినా జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చినా ప్ర భుత్వం సకాలంలో రైతులకు సాగునీరు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేసవిలో ప్రా జెక్టు క్రస్ట్ గేట్లకు మరమ్మతులు చేయాల్సి ఉండగా అప్పుడు పట్టించుకోని సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి, అధికారులు వే సవి ముగిసే సమయ ంలో రూ.11 కోట్ల నిధులతో మరమ్మతులకు టెండర్లు వేసి గుత్తేదారుకు కమీషన్లు ఇవ్వాలని వెంట బడడంతో అసలు పనులు చేయకుండానే గుత్తేదారు పరారీలో ఉన్నాడని వారు విమర్శించారు. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇప్పుడు 1, 4, 16, 31 గేట్ల వద్ద రో ప్వేలు తెగిపోయి సాగునీరు వృథాగా పో తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ప్రతి ఏడాది సాగునీటి ప్రాజెక్టులకు సాగునీరు వచ్చే ముందుగానే సంబంధిత శాఖ మంత్రులతోపాటు అధికారులు, ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసి రైతులు ఇబ్బందులు లేకుండా సాగునీరు విడుదల చేసే చర్యలు చేపట్టేవారని వారు గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోని ప్రాజెక్టులపైనే ముందస్తు అవగాహన లేక మరమ్మతులు చేపట్టకుండా గేట్లు తెగిపడే వరకు నిర్లక్ష్యం వహించిన ప్రజాప్రతినిధులపై, సాగునీటి పారుదల శాఖాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ కళాకారుడు అమరచింత వాసి దివంగత సాయిచంద్ రెండో వర్ధంతి సందర్భంగా ఈనెల 29వ తేదీన మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నూతన విగ్రహావిష్కరణ, అలాగే జెడ్పీ పాఠశాల ఆవరణలో నిర్వహించే బహిరంగసభకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కి ంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అథితులుగా వస్తు ండడంతో గురువారం మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మక్తల్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈసందర్భంగా వారు రాష్ట్ర గిడ్డుంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజనీసాయిచంద్తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి విగ్రహం, బహిరంగసభ ఏ ర్పాట్లను పరిశీలించారు. ఉమ్మ డి పాలమూరు జి ల్లాలోని నాయకులు, కార్యకర్తలతోపాటు పలువురు రాష్ట్ర నాయకులు వస్తారని జనసమీకరణ పెద్దఎత్తున చేపట్టాలని నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, బీఆర్ఎస్ నేతలు రవియాదవ్, నరేశ్‌రెడ్డి, రమేశ్, రాజు, నాగభూషణంగౌడ్, నర్సింహులుగౌడ్, చిన్నబాల్రాజు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లెనిన్, అభిమానులు శేఖర్ పాల్గొన్నారు.