మహబూబ్నగర్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, లీడర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ మండలంలోని రాంరెడ్డి గూడెం మిల్లు వద్ద ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతులతో శుక్రవారం మాజీ మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుం టే.. అదే విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే ప్రయత్నంలో అధికార పార్టీ మునిగిపోయిందని ఆరోపించారు.
ప్రజా వ్యతిరేకతను పక్కకు పెట్టి లీడర్లను తమ వైపునకు తిప్పుకుంటే అంతా అయిపోతుందని భ్రమలో ఉన్నారని విమర్శించారు. లీడర్లను కొనుగోలు చేయొచ్చు కానీ ప్రజలను కొనుగోలు చేసే దమ్ము మీకుందా అం టూ సవాల్ విసిరారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడాయని జోస్యం చెప్పారు. రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం భరతం పడతామని, ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించా రు. రైతులు అధైర్య పడొద్దని, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ వరంగల్ సభ పెడుతున్నట్లు ప్రకటన వచ్చిన వెంటనే పాత పద్ధతిలో పంట కొనుగోళ్లు ప్రారంభించారు.
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల మిల్లర్లు ఎక్కువ తరుగు తీస్తున్నారని , రెండు నుంచి మూడుకిలోలు తరుగు తీస్తున్నట్లు రైతులు చెబుతున్నారని వాపోయారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మూడుసార్లు రైతు బంధు ఎగ్గొట్టారని, వ్యవసాయానికి కరెంట్, యూరియా సరైన సమయంలో అందజేయకపోయినా కష్టపడి పం ట పండిస్తే కనీసం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అరకొర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పుడు అవి కూడా ఎత్తి వేశారని విమర్శించారు. మిల్లుల వద్దకు రైతులు వచ్చినా మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, ప్రైవేట్ వ్యాపారులు 40 కేజీలకు 3 నుంచి 4 కిలోల తరుగు తీస్తున్నారని, తక్కువ ధర ఇచ్చి వాళ్లే గ్రేడులు నిర్ణయించి రైతులను నిండా ముం చుతున్నారన్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరిగ్గా కొనకపోవడంతో రైతులు నష్టపోతున్నారని వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేశామని, తడిసిన ధాన్యాన్ని సై తం కొన్నామని, సమయానికి డబ్బులు కూ డా వేసామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఎందుకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తుందో చెప్పాలి.. రైతుల వడ్లు కొననందు కా..?? రైతులకు యూరియా ఇవ్వనందు కా..? కరెంట్ ఇవ్వనందుకా..?? పాలమూ రు ప్రాజెక్ట్ పూర్తి చేయనందుకు వారోత్సవాలు చేస్తున్నారా సమాధానం చెప్పాలని డి మాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్ర తి సమస్యపై పోరాటం చేసి ప్రభుత్వం మెడ లు వంచి వాటికి పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, విండో అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.