వనపర్తి, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : నిరుపేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దవాఖానలకు వచ్చే రోగులకు కనీస స్థాయి షుగర్ పరీక్షలను కూడా చేయలేని దీనస్థితికి రేవంత్ ప్రభుత్వం దిగజార్చిందని, పేదల ఆరో గ్యంపై ఈ ప్రభుత్వానికి పట్టింపులేదా అని ప్ర శ్నించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంతోపాటు డయాగ్నోస్టిక్స్ సెం టర్ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. దవాఖానలోని గర్భిణి మహిళలతో మా ట్లాడి వైద్య సహకారంపై తెలుసుకున్నారు.
అలాగే అక్కడే ఉన్న డయాగ్నోస్టిక్స్ సెంటర్‌ను పరిశీలించి ఎన్ని రకాల పరీక్షలు అందుతున్నాయన్న దానిపై ఆరా తీశారు. ఇంకా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు దాతల సహాయంతో నియోజకవర్గంలోని 9 అంబులెన్స్‌లను సమకూర్చిన వాటిని పరిశీలించారు. అనంతరం సింగిరెడ్డి మాట్లాడుతూ గతంలో వనపర్తి టీ డయాగ్నస్టిక్ సెంటర్ సేవల్లో రాష్ట్రంలో సిరిసిల్ల తర్వాత రెండో స్థానంలో ఉండేదన్నారు. ప్రస్తుతం 12వ స్థానంలోకి ఈ కేంద్రం సేవలు వెళ్లాయన్నారు.
కనీసం షుగర్ పరీక్షలకు అవసరమైన కెమికల్స్ కూడా లేకపోవడం వల్ల నిరుపేదలకు చాలా ఇబ్బందులు తలెత్తాయన్నారు. థైయిరాయిడ్ పరీక్షలు అందడం లేదని, 135 రకాల సేవలకు గానూ సగం సేవలు కూడా ప్రజలకు అందడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆరోగ్య శాఖ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్కార్ వైద్యాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పటికే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను ఎత్తివేసిన ప్రభుత్వం పేదల వైద్యాన్ని అందని ద్రాక్షగా చేస్తుందని నిరంజన్‌రెడ్డి ఆవేదన చెందారు. ప్రభుత్వ జనరల్ దవాఖానలో కొరవడిన సేవలు, వసతులపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాస్తానన్నారు.
తాను మం త్రిగా ఉన్నప్పుడు రూ.17 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్(అత్యవసర వైద్య సేవల విభాగం)ను మం జూరు చేయించడం జరిగిందన్నారు. దీని నిర్మాణం పూర్తి అయిందని, ఈ సెంటర్ వినియోగంలోకి వస్తే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన అత్యవసర చికిత్సలు అందుతాయన్నారు. ఒకేసారి 50 మందికి అత్యవసర చికిత్సలు అందించడం, అలాగే 25 ఇంటెన్సీవ్ కేర్ యూనిట్స్(ఐసీయూ)ల ద్వారా వైద్యం అం దించే సదుపాయం అందుబాటులోకి రానుందన్నారు. చివరి దశ పనులు చేసుకుని త్వరలోనే వినియోగం ఈ సెంటర్ రాబోతుందని నిరంజన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు తనతోపాటు కొందరు దాతల సాయంతో 9 అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని ని రంజన్‌రెడ్డి చెప్పారు. అయితే ఎలాంటి ప్రభుత్వ నిధులు లేకుండా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో ఎలా పెట్టుకుంటారని సిం గిరెడ్డి ప్రశ్నించారు. పేదలకు అత్యవసర సేవలు అందించడం కోసం అప్పట్లో తగినన్ని అంబులెన్స్‌లు లేని పక్షంలో ఇలా దాతల సహకారం తీసుకోవడం జరిగిందన్నారు.
గతంలో మాజీ ఎంపీ రా వుల చంద్రశేఖర్‌రెడ్డి ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించారని, అనంతరం కొల్లాపూర్, అలంపూర్ ప్రాంతాలతోపాటు వనపర్తి నియోజకవర్గంలో ఈ అంబులెన్స్‌లను వ్యక్తిగత సొమ్ముతో శ్రేయోభిలాషుల తోడ్పాటుతో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఇలా సొమ్ము దాతలది.. ఫొటో లు మాత్రం రేవంత్‌రెడ్డివి ఏర్పాటు చేసుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. సర్కార్ నిధులు ఇచ్చిన వాటికి సీఎం స్టిక్కర్లు అతికించుకుంటే సమస్యలేదని దాతలు ఇచ్చిన దానిపై కూడా ఫొటో అంటించుకోవడం దుర్మార్గం అన్నారు. మాజీ మం త్రి వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా నాయకులు వాకిటి శ్రీధర్, రమేశ్‌గౌడ్, పరంజ్యోతి, అశోక్, తిరుమల్, నాగన్నయాదవ్, హేమం త్, రాము, నీలస్వామి, రహీం, హరీఫ్, మునికుమార్, అలీం, శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.