వనపర్తి టౌన్, అక్టోబర్ 6 : బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగం గా సోమవారం రాత్రి వనపర్తి మండ ల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సం స్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం కా నుందని మేధావులు ప్రభుత్వానికి కొమ్ము ఖా యడం దురదృష్టకరమన్నారు.
పార్టీపై విధేయత, నాయకులపై విశ్వాసం ఉన్న నా యకులకు ప్రాధాన్యత ఉంటుందని, కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపి క ఉంటుందని పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. బీసీలను గందరగోళ పరిస్థితులకు గురిచేయడంపై బీసీ నాయకులు స్పందించకుండా ఉండడం మంచిది కాదన్నారు. పదవీ కాంక్షతో కోదండరాం నైతిక విలువలు కోల్పోయారన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పాన్‌గల్ జనరల్ స్థా నంలో ఎస్టీ బిడ్డను, వనపర్తి మున్సిపాలిటీ లో బీసీ బిడ్డను అందళం ఎక్కించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు.
రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయారని, నియోజకవర్గంలో మె జార్టీ సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశం లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, సీనియర్ నాయకు లు భానుప్రకాశ్‌రావు, విజయ్‌కుమార్, మతీన్, రఘువర్ధన్‌రెడ్డి, రవి ప్రకాశ్‌రెడ్డి, మాధవరెడ్డి, ధర్మనాయక్, న ర్సింహ, సాయిప్రసాద్, సుదర్శన్‌రెడ్డి, రాము, తదితరులు ఉన్నారు.